బకాయిలు రూ.13.31 కోట్లు
నల్లగొండ టూటౌన్: నీలగిరి పట్టణంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. పట్టణంలో 96 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, 300 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. 2024– 25కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను రూ.1.43 కోట్ల 15 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను రూ.6.20 కోట్ల 15 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లించని కారణంగా పాత బకాయిలతో కలిసి మొత్తం రూ.13 కోట్ల32లక్షల 38 వేలు ఉంది. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపు కోసం ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా ఇతర వాటికి దుబారా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నోటీసులు జారీ చేసిన అధికారులు
మార్చి 31 నాటికి పట్టణంలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టడంతో బకాయిదారుల జాబితా తయారు చేసి నోటీసులు అందజేశారు. అదేవిధంగా పట్టణంలో ఉన్న 96 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, 300 రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా సకాలంలో ఆస్తి పన్ను చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధరుసుం చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం పట్టించుకోకుండా సంబంధిత శాఖల అధికారులు వ్యవహిస్తుండడంతో ఆయా శాఖలకు సైతం భారం అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో ఆస్తి పన్ను చెల్లించాలని మున్సిపల్ సిబ్బంది సైతం గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొంది. బకాయిలపై కలెక్టర్ దృష్టి సారిస్తేనే వసూలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ నీలగిరి పట్టణంలో ఆస్తి పన్ను
చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు
ఫ నోటీసులు జారీ చేసిన మున్సిపల్ యంత్రాంగం
ఆస్తి పన్ను చెల్లించి అభివృద్ధికి సహకరించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు బకాయి లేకుండా వెంటనే ఆస్తి పన్ను చెల్లించాలి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చెల్లించడం ద్వారా వారికి అపరాధ రుసుం పడదు. ప్రతి ఆరు నెలలకు ఒక సారి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్
బకాయిలు రూ.13.31 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment