నిందితులకు శిక్ష పడితేనే ప్రజలకు నమ్మకం
నల్లగొండ : ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడితేనే.. ప్రజలకు పోలీస్‌శాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టు కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచడం, తప్పు చేసిన నిందితులకు శిక్ష పడే విధంగా చేసినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. కోర్టు అధికారులు, ప్రాసిక్యూటర్ల సమన్వయంతో న్యాయ సలహాలు తీసుకుని పనిచేయాలన్నారు. కేసు తుదిదశలో సాక్షులు, నిందితులు, బాధితులను సమయానికి కోర్టులో హాజరుపరిచేలా చూసుకోవాలన్నారు. సంవత్సరకాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ కేసుల్లో ఒకరికి ఉరిశిక్ష, 17 మందికి జీవిత ఖైదు విధించడం అభినందనీయమన్నారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రాసిక్యూటర్లను, కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు శివరాంరెడ్డి, డీఎస్పీ రాజశేఖరరాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శ్రీవాణి, అఖిల, వెంకటేశ్వర్లు, జవహర్‌లాల్, రంజిత్‌కుమార్, డీసీఆర్‌బీ సీఐ శ్రీనునాయక్, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు స్వీకరణ
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డేలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బాదితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో ఎస్పీ మాట్లాడి వారి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్‌శాఖను మరింత చేరువ చేయాలని, స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి చట్టపరంగా వారికి న్యాయం జరిగే విధంగా చూడాలని సూచించారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
Comments
Please login to add a commentAdd a comment