ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి
రామగిరి(నల్లగొండ): ఉన్నత విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఓఎస్‌డీ ప్రొఫెసర్ జి.అంజిరెడ్డి అన్నారు. నల్లగొండ ఎన్జీ కళాశాలలో సోమవారం జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు అతిగా సెల్‌ఫోన్లు వినియోగిస్తూ తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పులు లేకుండా, భావం చెడకుండా ఒక వాఖ్య రాయలేని స్థితిలో నేటి విద్యార్థులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంజీయూ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ రేఖ మాట్లాడుతూ ఆడ్ ఆన్ కోర్సుల్లో భాగంగా కత్రిమ మేధను చేర్చాలని సూచించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు. ఎన్జీ కాలేజీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు తన గురువు డాక్టర్ వీరయ్య పేరున ఏటా గోల్డ్ మెడల్ ఇస్తారని ప్రకటించారు. అలాగే మరో రెండు బంగారు గోల్డ్ మెడల్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన డాక్టర్ అంతటి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డిని అభినందిచారు. ఈ సందర్భంగా ఇండస్ట్రియలిస్ట్ శ్రీధర్‌రెడ్డి ఎస్జీ కళాశాలకు కంప్యూటర్లు అందజేస్తానన్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో అమలయ్యే పలు కీలక నిర్ణయాలను తీసుకున్న ఈ సమావేశంలో అకడమిక్ కౌన్సిల్ చైర్మన్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రాణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, అధ్యాపకులు మునిస్వామి, భట్టు కిరీటం, వెల్దండి శ్రీధర్, అనిల్ బొజ్జ, జ్యోత్స్న, శివరాణి, సావిత్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment