నల్లగొండ అగ్రికల్చర్ : యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుభరోసా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. రైతు భరోసాను ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.7500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కమిటీల పేరతో కాలయాపన చేసి వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా ఇవ్వలేదు. ఇక, యాసంగి సీజన్ నుంచి ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇస్తామని చెప్పి జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా నిధుల జమచేయడం ప్రారంభించింది. దశల వారీగా డబ్బులు ఖాతాల్లో జమ చేసింది. మూడు విడుతలు కలిపి జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,76,694 మంది రైతుల (మూడెకరాలలోపు) ఖాతాల్లో మొత్తం రూ.202,48,72,111 ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది.
5,60,810 మంది
పాస్‌బుక్కులు ఉన్న రైతులు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 5,60,801 మంది పట్టాదార్ పాస్‌బుక్కులు కలిగిన రైతులు ఉన్నారు. వారందరికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు పేరుతో రెండు సీజన్‌లకు కలిపి రూ.10 వేలు ఖాతాల్లో జమయ్యేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధును రైతు భరోసాగా పేరును మార్చి ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే సాగుకు యోగ్యం కాని భూములు 12,040 ఎకరాలను గుర్తించి మిగిలిన భూములకు రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు మూడెకరాలలోపు భూమి ఉన్న 2,76,694 మందికి మాత్రమే రైతుభరోసా నిధులు జమచేసింది. మూడెకరాలకుపైగా ఉన్న సుమారు 3.30 లక్షల మంది రైతులు రైతుభరోసా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పుడు ఇస్తారో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
ఫ రెండు నెలలైనా మూడు ఎకరాలలోపు రైతులకే అందని సొమ్ము
ఫ ఆందోళనలో మూడెకరాల పైన భూమి ఉన్న రైతులు
ఫ సీజన్ ముగిసినా ఎప్పుడిస్తారోనని ఎదురుచూపులు
మూడు దశలలో రైతు భరోసా జమ ఇలా...
విడత రైతులు జమైన డబ్బు(రూ.లలో)
మొదటి 35,568 46,93,19,160
రెండవ 1,55,232 88,42,80,319
మూడవ 85,894 67,12,72,632
మొత్తం 2,76,694 202,48,72,111