బీసీ లొల్లిని జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీ లొల్లి కార్యక్రమంలో జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ శాసనసభలో బిల్లును ఆమోదించించేందుకు సహకరించిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బిల్లులో ముస్లింలను చేర్చడాన్ని తప్పుపడుతూ ఈ బిల్లును కేంద్రం ఆమోదించకుండా అడ్డుపడాలని బీజేపీ చూస్తోందన్నారు. ఏప్రిల్ 25వ తేదీలోగా బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామని, లేకపోతే బీజేపీపై యుద్ధం ప్రకటిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కంది సూర్యనారాయణ, నల్ల సోమమల్లయ్య, దాసోజు విశ్వనాథం, నకిరెకంటి కాశయ్యగౌడ్, గోలి విజయ్‌కుమార్, గుండ కోటప్ప, పసుపులేటి సీతారాములు, చిక్కుళ్ల రాములు, ఆదినారాయణ, శంకర్‌గౌడ్, సైదులుగౌడ్, మధుయాదవ్, లింగయ్య, భాస్కర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్