కోసిగి మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12,770 కుటుంబా
ఉపాధిలో ‘పచ్చ’పాతం
● రోజుకు లక్ష మందికి
ఉపాధి కల్పించాలనేది లక్ష్యం
● 62వేల మందికి పనులు
కల్పిస్తున్నట్లు లెక్కలు
● ఇందులో 50 శాతం వరకు
దొంగ హాజరే
● సగటున కుటుంబానికి కల్పించిన
పని దినాలు 37 మాత్రమే
● టీడీపీ నేతల కనుసన్నల్లో
యంత్రాలతో పనులు
యంత్రాలతో పనులు చేయిస్తున్న దృశ్యం
గ్రామంలో పనుల్లేకనే వలస
నేను, నా భార్య లక్ష్మి ఏడాది పొడవునా రెక్కల కష్టం మీదనే బతుకుతున్నాం. గ్రామంలో ఉపాధి పనులు పెడతారేమోనని ఎదురుచూశాం. వర్క్ ఐడీలు రాలేదన్నారు. ఇంకా ఆలస్యం కావచ్చన్నారు. దిక్కులేక పిల్లలతో పాటు వలస వెళ్లాం.
– చిరంజీవి, కోతికొండ, తుగ్గలి మండలం
పెట్టుబడి కూడా
దక్కలేదు
నాకు 5 ఎకరాల భూమి ఉంది. వర్షాధారం కింద పత్తి సాగు చేస్తున్నా. వర్షాభావం, అధిక వర్షాల వల్ల ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పెట్టుబడి కూడా దక్కలేదు. స్థానికంగా ఉపాధి పనులు లేవు. భార్య, ముగ్గురు పిల్లలతో కలసి గుంటూరుకు వలస వెళ్లాం.
– సుధాకర్, యాటకల్లు గ్రామం, ఆస్పరి మండలం
యంత్రాలతో ఉపాధి పనులు
● వెల్దుర్తి, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ, ఆస్పరి తదితర మండలాల్లో యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
● ఇటీవలనే వెల్దుర్తి మండలంలోని ఓ గ్రామంలో యంత్రాలతో పనులు చేయిస్తుండగా సీపీఐ కార్యకర్తలు అడ్డుకోవడం కలకలం రేపింది.
● యంత్రాలతో పనులు చేయిస్తూ దొంగ మస్టర్లు వేసి ఉపాధి నిధులు కొల్లగొడుతుండటం గమనార్హం.
● నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో లేబర్‌తో చేయించాల్సిన పనులకు యంత్రాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సీజను ముగిసింది. ఉపాధి పనులకు సహజంగా జనవరి నుంచి మే నెల వరకు డిమాండ్ ఉంటుంది. ఈ సమయంలోనే 100 శాతం గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే సగం పంచాయతీల్లో ఉపాఽధి జాడ లేకపోవడంతో వేలాది కుటుంబాలకు బతుకు భారంగా మారింది. విధిలేని పరిస్థితుల్లో కటుంబ సభ్యులను వెంట తీసుకొని వలసబాట పడుతున్నారు. తుగ్గలి, పత్తికొండ, మద్దికెర, దేవనకొండ, మంత్రాలయం, కొసిగి, పెద్దకడుబూరు, హొళగుంద, హాలహర్వి, ఆలూరు, ఆదోని, ఆస్పరి మండలాలు అత్యల్ప వర్షపాతం ఉన్న మండలాలు. నంద్యాల జిల్లాలో ప్యాపిలి, డోన్, బేతంచెర్ల తదితర మండలాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ మండలాల్లో వ్యవసాయం కష్టతరం కావడంతో వలసలు సర్వసాధారణం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది నవంబర్ నెల నుంచే వలసలు మొదలైనప్పటికీ ఉపాధి పనులు కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. 2024–25 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1.71 కోట్ల పని దినాలు కల్పించాలనేది లక్ష్యం. ఆర్థిక సంవత్సరం మరో 35 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు కేవలం 1.40 కోట్ల పని దినాలు మాత్రమే కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 972 గ్రామ పంచాయతీలు ఉండగా అధికారుల లెక్కల ప్రకారం 90 శాతం పంచాయతీల్లో ఉపాధి పనులు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా 50 శాతం పంచాయతీల్లోనే ఉపాధి పనులు జరుగుతుండటం.. ఇది కూడా అరకొరగానే కావడం గమనార్హం.
సగటున 37 కుటుంబాలకే ఉపాధి
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం కుటుంబాలు 8,87,652. నేటికి ఈ కుటుంబాల సంఖ్య 30 శాతం వరకు పెరిగి ఉంటుంది. 2024–25లో కర్నూలు జిల్లాలో కటుంబానికి సగటున 37 పని దినాలు మాత్రమే కల్పించినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో కుటుంబానికి 38 పని దినాలు కల్పించినట్ల స్పష్టమవుతోంది.
ఉపాధి కల్పనలో ‘పచ్చ’పాతం
ఉమ్మడి జిల్లాలో మొత్తం జనాభా 40.53 లక్షలు. ఇందులో రోజుకు 1.56లక్షల మందికి ఉపాధి కల్పించాలనేది లక్ష్యం. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండాల్సిన సమయంలోనూ ఉపాధి 96 వేల మందికి మించని పరిస్థితి. కర్నూలు జిల్లాలో 62 వేలు, నంద్యాల జిల్లాలో 34 వేల మందికి మాత్రమే ఉపాధి లభిస్తోంది. ఇందులోనూ 50 శాతం వరకు బోగస్ హాజరు ఉంటోంది.ప్రస్తుతం ఉపాధి పనులు మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. మొన్నటి వరకు కేవలం ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే ఉండగా.. నేడు ప్రతి గ్రామంలో ఐదారు శ్రమశక్తి సంఘాలు పుట్టుకు రాగా, ప్రతి సంఘానికి ఒక మేట్ ఉన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్‌లు టీడీపీ కార్యకర్తలే. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఉపాధి పనులు కల్పించాల్సి ఉన్నప్పటికీ ‘పచ్చ’పాతం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
11,052 కుటుంబాలకే 100 రోజుల పని
ఉమ్మడి జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి లక్ష కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరినప్పటికీ కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 5,621 మందికి, నంద్యాల జిల్లాలో 5,431 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దక్కింది. సాధించిన ప్రగతి 19 శాతం మాత్రమే.
మండలం కుటుంబాలు వంద రోజుల
పని దక్కిన
కుటుంబాలు
గోనెగండ్ల 14,578 54
నందవరం 12,26668
క్రిష్ణగిరి 9,78074
కోసిగి మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12,770 కుటుంబా
కోసిగి మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12,770 కుటుంబా
కోసిగి మండలంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 12,770 కుటుంబా
Comments
Please login to add a commentAdd a comment