ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
బనగానపల్లె: కూరగాయలు, ఆకుకూరలు ప్రకృతి వ్యవసాయంతో సాగు చేస్తే అధిక దిగుబడు లు సాధించవచ్చునని వ్యవసాయ సాంకేతిక పరిశోధన, అనుప్రయోగ సంస్థ(అటారీ) హైదరాబాద్ జోన్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా అన్నారు. యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మీ అధ్యక్షతన యాగంటిపల్లెలో రైతులు సాగు చేసిన కూరగాయలు ఆకుకూరల పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన దిగుబడులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించి రైతులు లాభాలు పొందాలన్నారు. యాగంటిపల్లె పరిసర ప్రాంతంలో మామిడితోటలను సందర్శించి రైతులు చేపట్టిన యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. నేల, మానవాళి ఆరోగ్యం కోసం తప్పకుండా రసాయన రహిత వ్యవసాయ విధానాలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఆయన వెంట సొసైటీ ఏఓ సురేష్‌కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు ఉన్నారు.
శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
నంద్యాల(వ్యవసాయం): మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా రవాణా అధికారి రజియా సుల్తానా తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ 24వ తేదీ నుంచి శ్రీశైల క్షేత్రానికి వివిధ డిపోల నుంచి 180 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఆళ్లగడ్డ డిపో నుంచి 15, ఆత్మకూరు నుంచి 50, బనగానపల్లె 10, డోన్ 15, కోవెలకుంట్ల 15, నందికొట్కూరు 35, నంద్యాల డిపో నుంచి 40 బస్సులతో పాటు ఇతర జిల్లాల నుంచి 90 బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. బస్సుల మెయింటెన్స్ కోసం శ్రీశైలం హఠకేశ్వరం, దోర్నాలలో రిలీప్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. 24 గంటల పాటు ట్రాఫిక్ క్లియరెన్స్, మెయింటెన్స్‌పై నలుగురు ఎస్‌ఎస్‌ఓలు, పది మంది డీఎంఎస్, 100 మంది సూపర్ వైజర్లతో బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. అలాగే నంద్యాల డిపో నుంచి మహానందికి 25 బస్సులు, ఓంకారానికి 10, భోగేశ్వరానికి 3, ఆత్మకూరు డిపో నుంచి రుద్రకోడూరుకు 5, సంగమేశ్వరానికి 5, కొలను భారతికి 2, నందికొట్కూరు డిపో నుంచి భోగేశ్వరానికి 2, బనగానపల్లె డిపో నుంచి యాగంటికి 10, డోన్ డిపో నుంచి బ్రహ్మగుండంకు 14, కోవెలకుంట్ల డిపో నుంచి నయనాలప్పకు 6 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు మెరుగైన వసతులు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన దర్శనం క్యూలైన్లు, శివదీక్షా శి బిరాలు, పార్కింగ్ ప్రదేశాలు, 30 పడకల తాత్కాలిక వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూలైన్లలో నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు పంపిణీ చేయాలనాన్రు. దివ్యాంగులకు, చంటిబిడ్డ తల్లులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. శివదీక్ష శిబిరాలను సందర్శించి, ఏర్పాట్లపై పలువురు భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కోర్టుల భవన నిర్మాణాలకుస్థల పరిశీలన
ఎమ్మిగనూరుటౌన్: ఐదు అడిషనల్ కోర్టుల భవనాల నిర్మాణానికి ఎమ్మిగనూరు పట్టణంలో స్థలాలను శుక్రవారం జిల్లా జడ్జి కబర్ధి పరిశీలించారు. జూనియర్ సివిల్ కోర్టు భవనాన్ని పునర్నిర్మించేందుకు స్థానిక కోర్టు జడ్జి పి.హేమ, న్యాయవారులతో మాట్లాడారు. తాత్కాలిక కోర్టు ఏర్పాటు చేసేందుకు పట్టణంలో పాత మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అడిషనల్ కోర్టుల భవన నిర్మాణాలకు పాత తహసీల్దార్ కార్యాలయం, ఆదోని రోడ్డులోని టీబీపీ కార్యాలయం, వెటర్నరీ ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించారు. ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో తెలియజేయాల ని స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులకు, న్యాయవాదులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక జడ్జి హేమ, తహసీల్దార్ శేషఫణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురురాజారావు, కార్యదర్శి రఘురాం, న్యాయవాదులు మామిడి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
Comments
Please login to add a commentAdd a comment