ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ రాజకుమారి
శ్రీశైలంప్రాజెక్ట్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు సమగ్రంగా విచారణ చేసి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల పర్యవేక్షణకు శ్రీశైలం వచ్చిన కలెక్టర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సున్నిపెంటలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులో ఆమె మాట్లాడారు. రీ ఓపెన్ అయిన దరఖాస్తులను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల నుంచి వచ్చిన అర్జీలకు ప్రాధాన్యతని స్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. పీ4 సర్వే, మిస్సింగ్ హౌస్‌హోల్డ్ డాటా, ఎంఎస్‌ఎంఈ సర్వే, చిన్నపిల్లల ఆధార్ అప్‌డేట్‌లను మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని పారామీటర్లలో బనగానపల్లె, బేతంచెర్ల, శిరివెళ్ల మండలాలు వెనుకబడి ఉన్నాయని, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సర్వేలు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
బీసీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
● 600 మంది విద్యార్థులకు 5వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం
నంద్యాల(న్యూటౌన్): మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకు ల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి ద 2025–26 విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలల్లో 600 మంది విద్యార్థుల ప్రవేశానికి అవకాశం లభించింది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌టీటీపీఎస్://ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్, పాణ్యం ఎంజేపీఏపీబీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఫ్లోరమ్మ తెలిపారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటారన్నారు. మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు మొదటి, రెండవ, మూడవ జాబితాను ఖాళీలను బట్టి ప్రకటిస్తారన్నారు.
మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 20 మోడల్‌స్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ జనార్ధన్‌రెడ్డి ఒక ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి మార్చి 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.
పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరు
కర్నూలు(అగ్రికల్చర్): ఎన్‌టీఆర్ పెన్షన్ కానుక కింద మార్చి నెలకు ఉమ్మడి జిల్లాలో 4,53,829 పింఛన్లకు రూ.195.28 కోట్లు మంజూరయ్యాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చిలో 1,095 పింఛన్లపై కోత పడింది. ప్రభుత్వం పింఛన్ల పంపిణీ నిధులను ఈ నెల 28న బ్యాంకులకు విడుదల చేస్తుంది. మార్చి 1న ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
పర్యాటక ప్రాంతాల
అభివృద్ధికి కృషి
కర్నూలు కల్చరల్: ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) నూతన డివిజినల్ మేనేజర్ జి.లక్ష్మీనారాయణ అన్నారు. ఇప్పటి వరకు డీవీఎంగా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని ఏపీటీడీసీ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ స్థానంలో లక్ష్మీనారాయణ డీవీఎంగా నియమితులయ్యారు. సోమవారం వెంకటరమ ణ కాలనీలోని టూరిజం కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడు తూ పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరిచి సందర్శకుల సంఖ్య పెరిగేందుకు చర్యలు చేపడతామన్నారు. గార్గేయపురం చెరువు బోటింగ్ పాయింట్‌లో రోలింగ్ బోట్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నూతన డీవీఎంకు ఉర్దూ యూని వర్సిటీ ఇన్‌చార్జ్జ్ వీసీ ప్రొఫెసర్ షావలిఖాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment