చెరువులకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
ప్యాపిలి: కూటమి ప్రభుత్వం చెరువులకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. గుడిపాడు చెరువుతో పాటు పైప్ లైన్‌లో ఓ పైపును దుండగులు అపహరించిన ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం గుడిపాడులో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో హెన్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా చెరువులను నింపే కార్యక్రమం చేపట్టామన్నారు. 2024 ఎన్నికల కోడ్ వచ్చేనాటికి 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మరో నెలరోజులైతే అన్ని చెరువులు జలకళను సంతరించుకుని రైతులు ఈ పాటికి రెండు, మూడు పంటలు తీసేవారన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న పది శాతం పనులు పూర్తి చేయలేక ఆపసోపాలు పడుతుందని విమర్శించారు. దీనిని బట్టి రైతుల పట్ల ప్రభుత్వానికి, స్థానిక పాలకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. డోన్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకు తమ హయాంలో రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు కూడా తొలగించలేని పరిస్థితిలో ఉందన్నారు. డోన్‌లో వంద పడకల ఆసుపత్రి దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించామన్నారు. కనీసం ఈ ఆసుపత్రిలో రగ్గులు, బెడ్‌షీట్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేక పోయారని విమర్శించారు. కంబగిరి స్వామి ఆలయం, మద్దిలేటి స్వామి ఆలయాల అభివృద్ధి పనులను కొనసాగించలేక పోవడం బాధాకరం అన్నారు. గుండాల చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పైపుల దొంగలను
పట్టుకోవడంలో
విఫలం..
గుడిపాడు చెరువుకు నీటిని సరఫరా చేసే పైప్‌ను దుండగులు అపహరించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. దాదాపు 3–4 టన్నుల బరువు ఉన్న పైప్‌ను గ్యాస్ కట్టర్‌తో కత్తిరించి లారీలో తరలించినా పోలీసులు గుర్తించలేక పోయారన్నారు. కనీసం ఈ వ్యవహారంలో దుండగులను పట్టుకుని శిక్షించడంలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. డిపార్ట్‌మెంట్ తలచుకుంటే, పాలకులకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోవడం ఎంతసేపు అన్నారు. బుగ్గన వెంట రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, జెడ్పీటీసీ సభ్యులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, గుడిపాడు సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ వెంకటరామిరెడ్డి, ప్యాపిలి ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి. వైఎస్సార్‌సీపీ నాయకులు మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి, బోరెడ్డి రాము, రాజా మురళీకృష్ణ ఉన్నారు.
హంద్రీ నీవా నీరు చెరువులకు
తరలింపులో నిర్లక్ష్యం తగదు
90 శాతం పనులు వైఎస్సార్‌సీపీ
పాలనలోనే పూర్తి
పైప్‌లు చోరీకి గురవుతున్నా
పట్టించుకోరా?
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment