సింహ వాహనాధీశా... నమోస్తుతే!
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహానంది క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి అమ్మవార్లు సింహ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్/డిప్యూటీ కమిషనర్ ఎం.రామాంజనేయులు, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, అర్చకులు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. అనంతరం కనుల పండువగా గ్రామోత్సవం నిర్వహించారు.పూజా కార్యక్రమాల్లో ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లు ఉదయం సూర్యప్రభ వాహనంపై కొలువై ఆలయ ప్రాకారాల్లో విహరించారు.
Comments
Please login to add a commentAdd a comment