● రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కరీం
వెలుగోడు: విద్యాభివృద్ధికి ఏటా రూ. 15 లక్షలు సహాయం అందిస్తున్నామని ఫౌజియా కరీం ఫౌండేషన్ చైర్మన్, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ముల్లా అబ్దుల్ కరీం తెలిపారు. వెలుగోడు జూనియర్ కళాశాలలో ప్రిన్సి పాల్ వెంకటరమణ అధ్యక్షతన మంగళవారం ఫౌజి యా కరీం ఫౌండేషన్ స్కాలర్‌షిప్ పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముల్లా అబ్దుల్ కరీం మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత ఆశయాలు, లక్ష్యాలు కలిగి ఉండాలన్నారు. ఉర్దూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 97 శాతం మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. వక్తలు నసురుల్లా ఖాన్, హిదాయత్ అలీ ఖాన్, సుల్తాన్ మొహిద్దిన్‌లు మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆత్మకూరు, వెలుగోడు విద్యార్థుల బుక్స్, బ్యాగులనుఅందించడం హర్షించదగ్గ విషయం అన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు గౌరవ వేతనం, కళాశాల అభివద్ధికి నిధులకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అంజుమన్ ప్రెసిడెంట్ మోమిన్ రసూల్, మైనార్టీ నాయకులు ఖలీల్ ఖాన్, సయ్యద్ బాషా, డాక్టర్ ముల్లా అబ్దుల్ ఆఫ్రిద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment