కొత్తపల్లి: మండల కేంద్రంలో పశువుల మేత కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం దగ్ధమైంది. గ్రామానికి చెందిన ప్రాతకోట వెంకటరమణ, జి. మల్లయ్య సుమారు 40 ట్రాక్టర్ల వరిగడ్డిని లింగాపురం గ్రామం వెళ్లే దారి లోని కల్లం దొడ్డికి తరలించారు. ఆ గడ్డిని వాములు వేసేందుకు వేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి క్షణాల్లో పశుగ్రాసం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పక్కనే ఉన్న గడ్డివాములకు ప్రమాదం తప్పింది. దాదాపు రూ. 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment