పంట గొర్రెల పాలు
దేవనకొండ: రైతుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవిలాగా రైతుల పరిస్థితి మారింది. రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండించిన వంకాయలు మార్కెట్‌లో 20 కిలోల బస్తా ధర రూ.20 పలకడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీసం దానిని తీసిన కూలి కూడా గిట్టుబాటు గాక గొర్రెలకు వదిలేస్తున్నారు. మండల కేంద్రానికి సమీపంలో గోవిందు అనే రైతులు ఎకరం పొలంలో వంగతోట సాగు చేశాడు. ఇందుకు రూ.60వేలు ఖర్చు చేశాడు. పంట చేతికి రాగా.. బయట మార్కెట్‌లో బస్తా రూ.20 కిలో విక్రయిస్తే కేవలం రూ.2లే దక్కడంతో పంటలను గొర్రెలకు వదిలేశాడు. ప్రభుత్వం స్పందించి కనీస మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మార్కెట్‌లో ధర లేకపోవడంతో వంకాయ పంటను గొర్రెలకు వదిలేసిన దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment