సబ్ జైలు తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): పట్టణంలోని సబ్‌జైలును గురువారం కర్నూలు జిల్లా లీగల్‌సెల్ అఽథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి, నంద్యాల ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు జైలు పరిసరాలను పరిశీలించడంతో పాటు ఖైదీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు సూచించారు. ఉచిత న్యాయ సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చున న్నారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ప్రత్యేక వైద్యుడిని ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డికి పలు సూచనలు చేశారు.
త్వరలో ముచ్చుమర్రి నుంచి మల్యాలకు నీటి సరఫరా
పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పంప్‌హౌస్ నుంచి త్వరలో కృష్ణా జలాలను హంద్రీనీవా సుజల స్రవంతి అప్రోచ్ కాలువ ద్వారా మల్యాల ఎత్తిపోతల పంప్‌హౌస్‌కు నీటి సరఫరా చేస్తామని జలవనరుల శాఖ డీఈ శకుంతల తెలిపారు. నెహ్రూనగర్ సమీపాన ఉండే అప్రోచ్ చానెల్ కాలువ గట్లను ఆమె గురువా రం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మార్చి మొదటి వారం నుంచి మల్యాలకు నీటి సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తు న్నామని, అందులో భాగంగా కాల్వ గట్లను పరిశీలించామన్నారు. కాల్వ వెంట మట్టి తవ్వకాలు జరగడంతో లస్కర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువ వెంట నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని లస్కర్లను ఆదేశించారు. ఆమె వెంట ఏఈ హరిప్రసాద్ సిబ్బంది ఉన్నారు.
వేసవిలో తాగునీటి సమస్య రానీయొద్దు
బనగానపల్లె రూరల్: వేసవి సమీపిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి అన్నారు. గురువారం బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో యాగంటిపల్లె మంచినీటి పథకం, సీపీడబ్ల్యూ స్కీంలను ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ మధుసూదన్, ఏఈ సాయికృష్ణ, ఎంపీడీఓ వెంకటరమణతో కలిసి పరిశీలించారు. స్టోరేజ్ ట్యాంకుల్లో తగినంత నీటిని ఉంచుకోవాలన్నారు. అంతకు ముందు బనగానపల్లె ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీఓకు సూచించారు.
పుష్ప పల్లకీలో
మహానందీశ్వరుడి విహారం
మహానంది: మహానందీశ్వరస్వామి గురువారం రాత్రి పుష్ప పల్లకీలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కల్యాణోత్సవం అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దంపతులు పుష్పపల్లకీలో విహరించారు. ప్రత్యేక అలంకరణలోని ఉత్సవ మూర్తుల కు వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకు లు వనిపెంట జనార్ధనశర్మ, పండితులు మహామంగళ హారతు లు నిర్వహించిన అనంతరం పుష్పపల్లకీని గ్రా మంలో ఊరేగించారు. భక్తులు, స్థానికులు స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఏఈఓ వై.మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, దేవిక, ఇన్‌స్పెక్టర్లు శ్రీశైలం చిన్నా, శ్రీనివాసులు, ఉత్సవ కమిటీ సిబ్బంది నాగమల్లయ్య, లక్ష్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ జైలు తనిఖీ
సబ్ జైలు తనిఖీ
సబ్ జైలు తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment