ఆశల దీపం ఆరిపోయింది!
● నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
రుద్రవరం: ఏడాది వయస్సు ఉన్న బాలుడు ఆడుకుంటూ నీటి తొట్టిలో పడి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రెడ్డిపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నరాయుడు, నీరజ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడైన సూర్యకు ఏడాది వయస్సు ఉంటుంది. దంపతులిద్దరూ పిల్లలను ఇంటి వద్ద వదిలి గ్రామ సమీపంలో ఉన్న పొలంలో పనికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇద్దరు చిన్నారులు ఇంటి పక్కన పిల్లలతో ఆడుకుంటున్నారు. ఆ క్రమంలో ప్రమాదవశాత్తు సూర్య ఇంటి ప్రాంగణంలో నీటి తొట్టిలో పడిపోయాడు. కొద్ది సేపటికి అటుగా వెళ్తున్న గ్రామస్తులు నీటి తొట్టిలో బాలుడి ఉండటాన్ని గుర్తించి బయటకు తీయగా అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
ఆశల దీపం ఆరిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment