మంత్రాలయం: శ్రీరాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శ్రీగురుని పట్టాభిషేకం, 6వ తేదీన జయంతోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
హంద్రీ–నీవాకు రూ.3243.59కోట్లు కేటాయించారు. ఇందులో వెయ్యికోట్లు విద్యుత్ బకాయిలు. ఇక మిగి లేది రూ.2243.59 కోట్లు. గత బడ్జెట్‌లో రూ.1586.14కోట్లు కేటాయించారు. అంటే రూ.657.45కోట్లు అదనంగా కేటాయించారు. కానీ కర్నూలు నుంచి అనంతపురం జిల్లా వరకూ హంద్రీనీవా కాలువ వెడల్పు, ‘అనంత’ నుంచి లైనింగ్ పనులు చేస్తామని కేశవ్ ప్రకటించారు. ఈ నిధులు చూస్తే ప్రకటన మినహా పనులు పట్టాలెక్కే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. పైగా వైఎస్సార్ హయాంలో 3,850 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మించారు. దాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం తిరిగి దాన్ని 3,850 క్యూసెక్కులకే కుదించింది. కాలువ యథాతథంగా ఉండనుండగా ప్రభుత్వం మాత్రం మల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువను వెడల్పు చేసి, జీడిపల్లి నుంచి కుప్పం వరకు లైనింగ్ చేస్తామని ప్రకటించింది. మరి కాలువను ఎక్క డ వెడల్పు చేస్తారో మంత్రికే తెలియాలి. ఎల్‌ఎల్‌సీకి రూ.32కోట్లు, గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.34.06కోట్లు, గాజులదిన్నెకు రూ.11.97కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment