ఉపాధ్యాయ పోస్టులు మిగులు దశకు చేరేలా..
మండల ప్రజా పరిషత్‌పాఠశాలలో బోధిస్తున్న ఉపాధ్యాయుడు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కిలోమీటరు లోపు పరిధిలో ఒక మోడరన్ స్కూల్ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. నంద్యాల, డోన్, ఆత్మకూరు డివిజన్ల పరిధిలోని ఆర్‌డీఓల పర్యవేక్షణలో తహసీల్దార్, ఎంఈఓల బృందం ఇప్పటికే విలీనం చేయబోయే పాఠశాలలను గుర్తించి నివేదికను రూపొందించింది. తొలి దశలో 25 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న 3, 4, 5 తరగతుల విద్యార్థులందరిని సమీప పాఠశాలల్లో విలీనం చేస్తారు. తద్వారా ఒక గ్రామంలో మోడరన్ ప్రైమరీ స్కూల్‌గా పిలిచే ఒకే పాఠశాల ఉంటుంది. ఆ గ్రామంలో లేదా కిలోమీటరు పరిధి లోపు ఉన్న గ్రామాల్లోని పాఠశాలలు సమీపంలో ఏర్పాటు చేయ బోయే మోడరన్ స్కూళ్లలో విలీనం చేస్తారు. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు ప్రతి మండలంలోను మిగులు దశకు చేరుకునే అవకాశం ఉంది. ఆ ప్రభావం పరోక్షంగా డీఎస్సీపై పడి ఉపాధ్యాయుల భర్తీ సంఖ్య గణనీయంగా తగ్గే ప్రమాదం ఏర్పడింది.
ప్రభుత్వ కుట్ర
ప్రభుత్వ యూపీ పాఠశాలల ను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొన్నింటిని విలీనం చేసి మరి కొన్నింటిని మూసివేత దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యకు దూరమవుతారు. యూపీ పాఠశాలలను నిర్వీర్యం చేయడ మే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కార్పొరేట్ పాఠశాలలకు వత్తాసు పలికేందుకే ప్రభుత్వ కుట్రలో భాగంగానే యూపీ పాఠశాలలను ఎత్తి వేసే ప్రయత్నం ఇది. దీన్ని వ్యతిరేకిస్తాం.
– ఎంఆర్‌నాయక్,
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల
ప్రభుత్వ పాఠశాలలను
అభివృద్ధి చేయడమే లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా శాఖ నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ ఏడాది అన్ని గ్రామాల్లోను మోడరన్, ఫౌండేషన్ స్కూల్స్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ దిశగా జిల్లా విద్యాశాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది.
– జనార్ధన్‌రెడ్డి, డీఈఓ, నంద్యాల
యూపీ పాఠశాలలను
రద్దు చేయడం తగదు
నంద్యాల జిల్లాలో ఉన్న యూపీ పాఠశాలలను రద్దు చేయడం తగదు. పాఠశాల నుంచి జిల్లా పరిషత్ హైసూల్‌లోకి వెళ్లాలంటే 10 కి.మీ దూరం వెళ్లాల్సిందే. దీని వల్ల హైస్కూల్ విద్యకు విద్యార్థులు దూరమవుతారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మా గ్రామంలో డ్రాప్ అవుట్‌ను నివారించాలంటే ప్రాథకోన్నత పాఠశాలలను కొనసాగించాల్సిందే.
– దూదేకుల కాశీం, విద్యార్థి తండ్రి, కానాల గ్రామం, నంద్యాల మండలం
ఉపాధ్యాయ పోస్టులు మిగులు దశకు చేరేలా..
ఉపాధ్యాయ పోస్టులు మిగులు దశకు చేరేలా..
Comments
Please login to add a commentAdd a comment