అమ్మా.. బతికే ఉన్నా!
ఆడ బిడ్డనో.. మరో ఇతర కారణాలో తెలియదు కానీ శిశువు పుట్టిన క్షణమే ఆ తల్లి బంధాన్ని తెచ్చుకోవడంతో అనాథగా లోకానికి పరిచయమైంది. ఆ శిశువు అనారోగ్యం బారిన పడటం, వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసికందును చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు. శిరివెళ్ల మండలం జీనేపల్లెలో గత నెల 16వ తేదీన ఎస్సీ కాలనీలోని చర్చి సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నవజాత ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన సంఘటన పాఠకులకు విదితమే. అదే రోజు స్థానికుల సమాచారంతో ఐసీడీఎస్ సిబ్బంది శిశువును హక్కున చేర్చుకొని వైద్య పరీక్షల నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే శిశువు ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు బాగానే ఉన్నా.. తర్వాత తల వాపు రావడంతో గమనించిన వైద్యులు సిటీ స్కాన్, ఇతర పరీక్షలు చేశా రు. అయితే తలలో రక్తం గడ్డ కట్టినట్లు గుర్తించి స్థానిక ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో వారం రోజు ల క్రితం ఆపరేషన్ చేశారు. అయితే ప్రస్తుతం శిశువు అక్కడే వైద్య చికి త్స పొందుతూ ప్రస్తుతానికి ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్య వర్గాలు చెబుతున్నాయి. కన్న వారు ఉన్నా కూడా అనాథలా శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండం చూసిన సిబ్బంది, రోగుల సహాయకులు అయ్యో పాపం అంటూ నిట్టూర్చుతున్నారు. చిన్నారి రోదన చూసి కంటతడి పెడుతున్నారు. కన్న తల్లి ఎక్కడుందోనని చర్చించు కుంటున్నారు. ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీ మాట్లాడుతూ గుర్తుతెలి యని శిశువును ఐసీడీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఆసుపత్రిలో చేర్చి ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామని, చిన్న పిల్లల ఐసీయూలో చికిత్స పొందుతుందని తెలిపారు. – గోస్పాడు
ఆసుపత్రిలో
అనాథ శిశువు ఆక్రందన
Comments
Please login to add a commentAdd a comment