జగమేలు నాయకా.. జగదానంద కారకా
ఆళ్లగడ్డ: అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరద స్వామి హంస వాహనంపై కొలువై భక్తులను కనువిందు చేశారు. వేకువ జామునే నిత్యపూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకాలంకరణలో ఉన్న హంస వాహనాన్ని అధిష్టించిన ప్రహ్లాదవరదుడు మాడ వీధుల్లో విహరించారు. అహో బిల మఠం చేరుకున్న హంసవాహానదీశుడైన అహోబిలేశునికి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు చేపట్టారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువైన ప్రహ్లాదవరదుడు భక్తులను కునువిందు చేశారు.
భక్త హనుమంత .. తనువు పులకింత
ఎగువ అహోబిల క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహుడు హనుమంత వాహనంపై వివహరించారు. త్రేతాయుగం నాటి శ్రీరాముడిని తానేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవలో స్వామివారు కోదండరామ అలంకరణలో భక్తులను కటాక్షించారు. కృతయుగంలో వేంకటేశ్వరుడిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో అహోబిలేశుడిగా స్వామి అవతరించారనే సందేశాన్ని చాటుతూ మాడవీధుల్లో హనుమంత వాహనసేవ.. రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కరింపజేసింది.
హంస, సూర్యప్రభ వాహనాలపై
దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు
జగమేలు నాయకా.. జగదానంద కారకా
Comments
Please login to add a commentAdd a comment