మహిళలు సర్వశక్తిమంతులు
నంద్యాల: జన్మతః సీ్త్రలు శక్తివంతులు, సమర్థవంతులని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆమె మాట్లాడుతూ మహిళలు ఉన్నతమైన వ్యక్తిత్వంతో పాటు ఆత్మాభిమానం కలిగి ఉంటారన్నారు. మహిళలు సర్వశక్తివంతులని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగంలో వున్నా, వ్యాపార, రాజకీయ ఇతర రంగాల్లో స్థిరపడాలన్నా, ఆయా రంగాల్లో ఉత్తమ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. నిర్దేశించిన ఏ చిన్న పనైనా ప్రణాళిక బద్ధంగా నిర్వహించి వంద శాతం విజయం సాధించగలిగే సత్తా వారిలో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి సీ్త్ర ఏదైనా రంగంలో పట్టు సాధించాలంటే సంబంధిత అంశంపై లోతైన విశ్లేషణ ఉండడంతో పాటు పది మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలన్నారు. సమాజంలో స్థిరపడిన మహిళ పారిశ్రామికవేతలు వారు ఎదగడమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించే రీతిలో ఉండాలన్నారు. తమ పిల్లలను ఆడ, మగ తారతమ్యం లేకుండా సమాన స్థాయిలో పెంచి ఉత్తమ పౌరులుగా దేశ, రాష్ట్ర భవిష్యత్తులో చక్కటి భాగస్వామ్యం పంచేలా పెంచాలన్నారు. లింగ వ్యవస్థతపై చట్టాలు ఉన్నప్పటికీ నిరాశ్రయులైన అనాథ పిల్లలకి సమగ్ర శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి
Comments
Please login to add a commentAdd a comment