గవర్నర్‌ను కలసిన ఆర్‌యూ వీసీ
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వి.వి.బసరావు శుక్రవారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్, వర్సిటీ చాన్సలర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్‌యూ అభివృద్ధికి రాజ్‌భవన్ సహాయ సహకారాలు ఉంటాయని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వీసీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడంపై దృష్టి సారించాలని సూచించారన్నారు. విద్యా రంగంలో ఉమ్మడి జిల్లాను ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయాల్సిందిగా సూచించారని పేర్కొన్నారు.
ముగిసిన వాదనలు
కర్నూలు(టౌన్): సినీ నటుడు పోసాని కృష్ణమురళీకి సంబంధించి బెయిల్ పిటిషన్ వాదనలు శుక్రవారం ఆదోని కోర్టులో ముగిసాయి. కర్నూలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న పోసానికి బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు సువర్ణ రెడ్డి వేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున ఆదోని సీనియర్ ఏపీపీ వాదించారు. సుదీర్ఘంగా రెండు గంటల పాటు ఇరువురి వాదనలు సాగాయి. బెయిల్ పిటిషన్‌కు సంబంధించి కోర్టు తీర్పును రిజర్వు చేసింది. అలాగే పోలీసు కస్టడీకి సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తామని మొదటి అదనపు జ్యుడీషిషల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ అపర్ణా వెల్లడించారు.
ఉచిత శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా నంద్యాలలో దరఖాస్తులు పొందిన వారు స్థానిక బొమ్మలసత్రం వద్ద ఉన్న ఓల్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్ సీ బ్లాక్‌లో అందజేయాలన్నారు.
అక్రమణను అడ్డుకున్న మహిళలు
సంజామల: పేరుసోముల గ్రామంలో టీడీపీ నాయకులు ఆక్రమణను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. శ్మశాన వాటిక రస్తా ఆక్రమణకు గురవుతుందని దాదాపు రెండు నెలల నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు తహసీల్దార్, కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేసినా చర్యలు తీసుకోలేదు. శ్మశాన వాటిక స్థలంలో శుక్రవారం ప్రహరీ నిర్మిస్తున్నారని తెలుసుకున్న మహిళలు అక్కడికి చేరుకుని కూల్చివేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కంబగిరి ఆధ్వర్యంలో మహిళలు తహసీల్దార్ అనిల్ కుమార్‌కు వినతి పత్రాన్ని అందించారు. ఆక్రమణదారుల నుంచి శ్మశాన వాటిక స్థలాన్ని రక్షించాలని కోరారు.
గవర్నర్‌ను కలసిన ఆర్‌యూ వీసీ
Comments
Please login to add a commentAdd a comment