
మద్దిలేటయ్యకు ఒక్క రోజు ఆదాయం రూ.3.28 లక్షలు
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివార్లో వెలసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీలక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామికి శనివారం రూ.3,28,415 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 461 మంది గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 461 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ సునిత తెలిపారు. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షకు 13,862 మందికి గాను 13,401 మంది హాజ రు కాగా 461 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఒకేషనల్ పరీక్షకు 1,497 మందికి గాను 1,383 మంది హాజరు కాగా 114 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పట్టణంలోని బాలికల మహిళా కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను పరిశీలించామన్నారు. విద్యార్థులకు నీటి సమస్య తలెత్తితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పొట్టేళ్లు అ‘ధర’ హో..
కోడుమూరు రూరల్: బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో చాలామంది ప్రజలు చికెన్‌ను వదిలేసి మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. రంజాన్ నెల ప్రారంభం కావడంతో పొట్టేళ్లకు గిరాకీ పెరిగింది. చిన్న సైజు పొట్టేలు ధర కూడా రూ.10వేలకు పైనే పలుకుతోంది. శనివారం కోడుమూరులో జరిగిన సంతలో ఒక్కో పొట్టేలు సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.20వేలకు పైగా పలికింది. పొట్టేళ్ల ధరలు భారీగా ఉన్నప్పటికీ ప్రజలు కొనేందుకు ఎగబడ్డారు.

మద్దిలేటయ్యకు ఒక్క రోజు ఆదాయం రూ.3.28 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment