లాభాల బాట పట్టించిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం
నష్టాల ఊబిలో చిక్కుకున్న డీసీసీబీకి గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందచేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. 2022–23, 2023–24 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో ఏకంగా రూ.10కోట్ల లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా రెండేళ్లు వరుస అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.
● నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోపే మళ్లీ నష్టాల్లోకి వచ్చి బలహీనమైన బ్యాంకుగా రికార్డు నమోదు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా 2024–25లో రుణాల పంపిణీ నామమాత్రంగా చేపట్టారు. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ పేరుతో రైతులకు అవసరమైన రుణాల పంపిణీ విషయంలో కనీస చొరవ కరువైంది. ఇదే సమయంలో బకాయిలు పేరుకుపోవడంతో బ్యాంకు మళ్లీ నష్టాల బాట పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment