ప్రశాంతంగా ఏఎన్‌ఎంల పదోన్నతి కౌన్సెలింగ్
కర్నూలు(హాస్పిటల్): సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎం–3లకు ఎంపీహెచ్‌ఏ–ఎఫ్‌గా పదోన్నతి కల్పించా రు. ఈ మేరకు వీరికి కర్నూలు మెడికల్ కాలేజీలో కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు. కౌన్సెలింగ్‌లో స్థానం పొందిన వారికి డీఎంహెచ్‌వో డాక్టర్ శాంతికళ, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు ఆర్డర్ కాపీలు అందజేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 172 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓతో పాటు ఏవో అరుణ, సూపరింటెండెంట్ పి. శ్రీనివాసుల కౌన్సెలింగ్ నిర్వహించి స్థానాలు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment