సూర్య @ 42.7 డిగ్రీలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒకవైపు సుర్రుమంటున్న ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఎండల నుంచి ప్రజలకు కొంతైనా ఉపశమనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లు కర్నూలు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. 2024లో ఫిబ్రవరి నెల చివరి నాటికే చలువ పందిళ్లు ఏర్పాటు అయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చలువ పందిళ్లు, చలి వేంద్రాల జాడ కనిపించడం లేదు.
బండిఆత్మకూరు మండలంలో
42.7 డిగ్రీల ఉష్ణోగ్రత...
రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతున్నాయి. బండి ఆత్మకూరు మండలం పెద్ద దేవళాపురం గ్రామంలో 42.7 డిగ్రీలు, కల్లూరులో 42.6, చాగలమర్రిలో 42.4 డిగ్రీలు, గోస్పాడులో 41.9, దొర్నిపాడులో 41.7, ఆత్మకూరులో 41.5, కొత్తపల్లిలో 41.4, కోడుమూరులో41.2, కోసిగిలో 41.2, పెద్దకడు బూరులో 41.1 కర్నూలులో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత లు నమోదైంది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. రానున్న రోజుల్లో వడగాల్పులు, ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మార్చి నెలలో నే ఉష్ణోగ్రతలు గతంలో ఎపుడూ లేని విధంగా 44 డిగ్రీలను అధిగమించే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచిస్తున్నారు.
పెద్ద దేవళాపురంలో
అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
కల్లూరులో 42.6 డిగ్రీలు నమోదు
వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
Comments
Please login to add a commentAdd a comment