యువకుడిఅనుమానాస్పద మృతి
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో ఓ యువకుడు మంగళవారం అనుమానా స్పదంగా మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక ఎంఎస్ నగర్ వీధికి చెందిన వెంకటేష్ శుభకార్యాల కు వంటల కాంట్రాక్ట్ ఒప్పుకుని కుటుంబాన్ని పోషించేవాడు. వెంకటే ష్ టీచర్స్ కాలనీలో ఉంటున్న వాణి అనే యువతిని ప్రేమించి పెద్దల అంగీకారంతో గతేడాది డిసెంబర్ 31వ తేదీన వివాహం చేసుకున్నాడు. సంసారం సాఫీగా సాగుతున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంకటేష్ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి నిద్రపోయాడు. కొన్ని గంటల తర్వాత భార్య వెళ్లి చూడగా అతను అపస్మారక స్థితిలో కనిపించాడు. మెడకు గాయమైనట్లు గుర్తించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే వెంకటేష్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి కారణాలు విచారణలో తెలుస్తాయన్నారు.
రెండు బైక్‌లు ఢీకొని..
● వృద్ధుడి మృతి
● యువకుడికి తీవ్ర గాయాలు
పత్తికొండ రూరల్: అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. టిఫిన్ చేసేందుకు హోటల్ వెళ్లిన వృద్ధుడు తిరిగిరాని లోకాలకు చేరాడు. పత్తికొండ పట్టణంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో యువకు డు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక దాసరి వీధిలో బోయ హనుమన్న, తిమ్మక్కలు నివాసముంటున్నారు. వారి కుమారుడు భార్యా పిల్లలతో బతుకుదెరువుకు గుంటూరు వలస వెళ్లారు. ఇంటి వద్ద వున్న తిమ్మక్క మంగళవారం మిరపకాయలు తెంపేందుకు కూలికి వెళ్లగా.. హనుమన్న టిఫిన్ చేసేందుకు టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ప్రభుత్వ బీసీ హాస్టల్ సమీపంలోని ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లాడు. టిఫిన్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేందుకు వాహనాన్ని తీస్తుండగా పత్తికొండకు చెందిన కూరగాయల వ్యాపారి అభిరాం పల్సర్ బైక్‌తో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా కోలు కోలేక వృద్ధుడు మృతి చెందాడు. యువకుడు అభి రాం చికిత్స పొందుతున్నాడు. భర్త మృతితో భార్య తిమ్మక్క రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.
యువకుడిఅనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment