బొమ్మలసత్రం: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్‌రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. నేరా ల నియంత్రణకు పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఆధునిక సాంకేతికను ఉపయోగించి మిస్సింగ్ కేసులు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించాలన్నారు. అనుమానాస్పద మృతి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి కేసును ఛేదించాలని ఆదేశించారు. ఎన్‌డీపీఎస్, పోక్సో కేసుల్లో నిందితులపై రౌడీషీట్‌లు తెరవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, డీఎస్పీలు జావలి ఆల్ఫోన్స్, ప్రమోద్, రామాంజినాయక్, రాజసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
ప్యాపిలి: ఏనుగుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్ బొజ్జన్నపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకట రామిరెడ్డి తెలిపారు. విద్యార్థినుల పట్ల బొజ్జన్న అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో గురువారం విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమో దు చేసినట్లు ప్యాపిలి పోలీసులు తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి
కొత్తపల్లి: నూతన సాంకేతిక పద్ధతులతో దళిత రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ హెడ్ జి.ధనలక్ష్మీ అన్నారు. శుక్రవారం కొక్కెరంచ గ్రామంలో సర్పంచు విష్ణువర్ధన్ రెడ్డి, ఏఓ కె.మహేష్‌లతో కలసి కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె వారి ఆధ్వర్యంలో జాతీయ వ్యవ సాయ పరిశోధన యాజమాన్య సంస్థ(నార్మ్) హైదరాబాద్ వారు దళిత రైతులకు టార్పాలిన్, వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్ కులాల ఉపప్రణాళిక పథకంలో భాగంగా టార్పాలిన్, సూక్ష్మపోషకాలు రైతుల వారీగా రెండు వందల మందికి, రోటవేటర్, తొమ్మిది చెక్కల గొర్రు, శ్రేడ్డర్, థైవాన్ స్ప్రెయర్ పంపులు, పారలు, ఇతర వ్యవసాయ పరికరాలను గ్రూపుల వారీగా పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ పరిశోధ యాజమాన్య సంస్థ (నార్మ్) శాస్త్రవేత్తలు బాలకృష్ణన్, నిర్మల, సొసైటీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సరేష్ కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు రమణయ్య, కృష్ణమూర్తి, ఆదినారాయణ, రవిగౌడ్, రైతులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులపై నేరాలు అరికట్టాలి