
రుణాలు ఊరించి.. చేయూత మరిచి!
బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపులకు అరచేతిలో వైకుంఠం
● కర్నూలు జిల్లాలో 2,034 మందికి లబ్ధి చేకూర్చాలని లక్ష్యం ● 27,140 మంది దరఖాస్తు ● పూలే జయంతి రోజున 508 మందికి మెగా చెక్కు ● మిగిలిన వారి పరిస్థితి ప్రశ్నార్థకం ● వైఎస్సార్‌సీపీ హయాంలో నవరత్నాల పేరిట 6.97 లక్షల మందికి లబ్ధి
కర్నూలు(అర్బన్): బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అందించునున్నట్లు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, మైనారిటీ వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించి వారి ఆర్థిక స్థితి గతుల్లో మార్పు తీసుకొస్తామని ప్రకటించింది. అయితే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచిపోయినా, నేటికి కార్పొరేషన్ల రుణాలకు సంబంధించి స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయం. జనవరి నెల మొదటి వారంలో బీసీ వర్గాలకు రుణాలు అందించేందుకు అంతా సిద్ధమైందని, వెంటనే అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని తేదీలు ప్రకటించి మరీ హడావుడి చేశారు. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన ఓబీఎంఎంఎస్ వెబ్‌సైట్ పలు ఆర్థిక, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యంగా ఓపెన్ అయ్యింది. కర్నూలు జిల్లాలో బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన 2,034 మందికి ( బీసీ 1673, కాపు 190, ఈడబ్ల్యూఎస్ 171 ) సబ్సిడీ, బ్యాంకు రుణం కలిపి రూ.41.23 కోట్ల మేర స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో అర్హులైన 27,140 మంది దరఖాస్తు చేసుకున్నారు.
508 మంది ఎంపికై నట్లు మెగాచెక్కు
జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించిన లక్ష్యం మేరకు 2,034 మందికి రూ.41.23 కోట్ల మేర రుణాలను అందించాల్సి ఉంది. అయితే ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రుణాలకు సంబంధించి 508 మంది లబ్ధిదారులు ఎంపికై నట్లు రూ.11.77 కోట్ల మెగాచెక్‌ను అందించారు. ఇందులో 488 మంది బీసీలు, 7గురు కాపులు, 13 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అయితే లక్ష్య సాధనలో భాగంగా 508 మంది పోగా, మిగిలిన 1,526 మందికి రుణాలు ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థకం.
అందరికీ రుణాలు అందుతాయి
మొదటి విడతలో ఈ నెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున జిల్లాలో ఎంపికై న 508 మందికి రూ.11.77 కోట్ల మెగా చెక్కు ను లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ అందించారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యం మేరకు మిగిలిన వారికి కూడా రుణాలు అందుతాయి.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల నుంచి లబ్ధిదారుల జాబితాలను బ్యాంకులకు పంపి ఖాతా లను ఓపెన్ చేయించి జాబితాలను తమ కార్యాలయాలకు పంపాలని కోరనున్నాం. జాబితాలు అందిన వెంటనే జిల్లా కలెక్టర్ ద్వారా ఆమో దం తీసుకొని తమ శాఖ ఉన్నతాధికారి కార్యాలయానికి పంపుతాం.
– ఎస్ జాకీర్‌హుసేన్, ఈడీ, బీసీ కార్పొరేషన్
ఏఏ పథకాల ద్వారా ఎంతెంతంటే ....
వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.2049.22 కోట్ల లబ్ధి
గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించి అమలు చేసిన వివిధ పథకాల ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6,97,147 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2049.22 కోట్లు జమ అయ్యాయి.

రుణాలు ఊరించి.. చేయూత మరిచి!