పెద్దకడ్మూర్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు
నారాయణ్‌పేట్: దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని డీసీసీ అద్యక్షులు వాకిటి శ్రీహరీ అన్నారు. గురువారం రాత్రి పెద్దకడ్మూర్‌లో నిర్వహించిన రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ, కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ ఫోరం రాష్ట్ర కమిటి సభ్యులు పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, నేటికీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచాయన్నారు. ఆనాడు ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ అందించిన గొప్ప పథకాల కోసం రాష్ట్రంలో ఇటీవల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.
పీసీసీ అద్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు విదేశాలను వదిలి జన్మభూమికోసం వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్‌ఆర్‌ఐ పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్‌రెడ్డి, నాగరాజుగౌడ్, గౌని బాలకృష్ణారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, గోపాల్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్, లక్ష్మారెడ్డి, బల్‌రాంగౌడ్, చెన్నయ్యసాగర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment