బావాజీ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలి
కొత్తపల్లి: దక్షణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన లంబాడా జాతర.. గురులోకమా సంద్ బావాజీ జాతర అని, అన్ని ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని తిమ్మారెడ్డిపల్లి జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 11వ తేది నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు బుదవారం అన్ని శాఖల వారిగా నారాయణ పేట జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్‌వార్ (లోకల్ బాడి) సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి, స్నానాల గదులు, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించాలని, ఇప్పటినుంచే పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. అనంతరం ఇంతకుముందు నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులతో పాటు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment