డ్రెయినేజీలు నిర్మించాలి
ప్రఽదాన వీధులన్నీ మురికి కూపాలుగా మారాయి. కొత్తకాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మురుగు నిల్వ ఉండడంతో దోమల బెడద తీవ్రమైంది. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీలు నిర్మించడంతోపాటు విధిగా డ్రైనేజీల్లో మురుగు తొలగించాలి.
– రాజు, శ్రీనగర్ కాలనీ, కోస్గి మున్సిపాలిటీ
అధికారుల నిర్లక్ష్యంతోనే..
మక్తల్ పట్టణంలో మున్సిపాలిటీ పరిదిలోని 8, 9 వార్డులో మురికికుంట ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఎన్ని సార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇళ్ల మధ్య చెత్తచెదారం నిలిచి ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు మా గోడు దేవుడికే తెలుస్తుంది. దోమకాటుతో టైఫాయిడ్, డెంగీ లాంటి రోగాల బారిన పడుతున్నాం.
– బాబు, శబరికాలనీ, మక్తల్
●
డ్రెయినేజీలు నిర్మించాలి
Comments
Please login to add a commentAdd a comment