
ఉపయోగకరంగా ఉంది..
విద్యార్థుల్లో చిన్నతనం నుంచే డిజిటల్ నైపుణ్యాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధాను పరిచయం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును ప్రాథమిక తరగతుల విద్యార్థులకు నేర్పించడం వల్ల చదువుతోపాటు, పఠనా సామర్థ్యాలు పెరుగుతున్నాయి. పిల్లల స్థాయిని బట్టి కంప్యూటర్ బోధన ఉండటంతో మరింత ఆసక్తిగా విద్యార్థులు పాల్గొంటున్నారు. గైర్హాజరు శాతం తగ్గేందుకు ఆస్కారం ఉంది. ప్రయోగాత్మకంగా జిల్లాలో 10 చోట్ల ప్రారంభించాం. విజయవంతం అయితే వచ్చే ఏడాది మరిన్ని పాఠశాలలకు విస్తరించేందుకు చర్యలు చేపడుతాం.
– విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట
సులభంగా ఉంది..
ఉపాధ్యాయులు పుస్తకాలతో ప్రతిరోజు పాఠ్యాంశాల బోధన చేస్తుంటారు. కానీ, ఇటీవల మా పాఠశాలలో కంప్యూటర్ ద్వారా చదువు చెబుతున్నారు. దీంతో పుస్తకాల్లోని అంశాలు చాలా సులభంగా అర్థమవుతున్నాయి. చదవాలనే ఉత్సాహం మరింత పెరిగింది.
– మీనాక్షి, 5వ తరగతి, నారాయణపేట
అర్థం అవుతున్నాయి..
మా తరగతిలో విద్యార్థులు చాలా వరకు పాఠశాలకు గైర్హాజరు అయ్యేవారు. పాఠాలు అర్థం కాక హోంవర్క్ చేసుకుని రాకపోతే టీచర్లు కొడతారని డుమ్మా కొట్టేవారు. విద్యార్థుల స్థాయిని బట్టి కంప్యూటర్‌లో బోధన వేగంగా, నిదానంగా జరుగుతుండటంతో అన్ని విషయాలు బాగా అర్థం అవుతున్నాయి.
– భార్గవ్, 5వ తరగతి, నారాయణపేట
ఈ విధానం బాగుంది..
కంప్యూటర్ ద్వారా బోధన ప్రారంభించిన తర్వాత తెలుగు, ఆంగ్లంలో పదాలను అర్థం చేసుకుని బాగా పలుకుతున్నాం. గణితంలోనూ కూడికలు, తీసివేతలు తదితర వాటిని చక్కగా చేయగలుగుతున్నాం. మొదట్లో టీచర్లు ఎంత చెప్పినా నెత్తికి ఎక్కేది కాదు. ప్రస్తుత విధానం బాగుంది.
– విజయలక్ష్మి, 4వ తరగతి, కొల్లంపల్లి, నారాయణపేట

ఉపయోగకరంగా ఉంది..

ఉపయోగకరంగా ఉంది..

ఉపయోగకరంగా ఉంది..
Comments
Please login to add a commentAdd a comment