పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుదాం..
మక్తల్/మాగనూరు/ఊట్కూర్: మక్తల్ నియోజకవర్గంలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు.. ఊట్కూర్ పులిమామిడి గుట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా.. నేరడగంలో పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం సమీప ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మంత్రి మక్తల్, మాగనూర్, కృష్ణా, ఊట్కూర్ మండలాల్లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించారు. ముందుగా జక్లేర్ గ్రామంలోని పురాతనమైన శివాలయాన్ని సందర్శించారు. శివరాత్రి సమయంలో శివస్వాములు మాలధారణ, సేద తీరేందుకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని మంత్రి అన్నారు.
● మాగనూర్ మండలంలోని నేరడగం శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం బ్రహ్మోత్సవాల్లో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. సిద్ధలింగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో అడుగంటిపోతున్న విలువలను పునరుద్ధరించడానికి ఈ మఠాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, మన సంస్కృతి, సనాతన ధర్మాన్ని మళ్లీ పునరుద్ధరించడం వీటి వల్లే సాధ్యమవుతుందని అన్నారు. రూ.50 లక్షలు అన్నదాన కార్యక్రమానికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నిరంతరం నీరు ఉండే ఈ సంగంబండ ప్రాజెక్టుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో శ్రీమన్ మహారాజా నిరంజన జగద్గురు ఫకిర దింగాలెస్వర మహాస్వాములు, బిజ్వార్ ఆదిత్య పరాశ్రీ, నియోజక వర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, గురుమిట్కల్ ఎంఎల్‌ఏ కందుకూరు శరణ్‌గౌడా, పంచమ సిద్ధలింగ మహాస్వామి తదితరులు పాల్గొన్నారు.
● ఊట్కూరు మండలంలోని పులిమామిడి గుట్టపై ఉన్న రామలింగేశ్వక ఆలయాన్ని మంత్రి, ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి పరుస్తానని అన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పులిమామిడి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment