ముగ్గురు వైద్యుల మూకుమ్మడి రాజీనామా
కోస్గి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ అధికారి వ్యవహరిస్తున్న తీరుకు విసుగుచెంది ముగ్గురు వైద్యులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి పత్రాలను జిల్లా అధికారులకు పంపడంతో పాటు మూడురోజులుగా విధులకు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నెల 19న చోటు చేసుకున్న రాజీనామాల వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి మల్లికార్జున్ సూపరింటెండెంట్‌గా ఉండగా డా. అనుదీప్ ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. డీఎంఓలుగా డా. తరుణ్, డా. రహీం, డా. లోకేష్ , గైనిక్ వైద్యురాలిగా డా. శ్వేత, చిన్నపిల్లల వైద్యులుగా డా. వెంకటేష్ విధులు నిర్వహిస్తున్నారు. గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యుడు రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు విధులు నిర్వర్తిస్తారు. ముగ్గురు డీఎంఓలు విడతల వారీగా 24 గంటలు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తారు. వీరంతా కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్నారు. కొంతకాలంగా డా. అనుదీప్‌కు, మిగిలిన వైద్యులకు విధులు, ఆస్పత్రి నిర్వహణ విషయంలో సఖ్యత లేకపోవడంతో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ నెల 16న రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడు డా. రహీం రంజాన్ ఉపవాస దీక్ష సందర్భంగా తెల్లవారుజామున ఆస్పత్రిలోనే భోజనం చేసి పడుకున్నారు. ఉదయం ఆస్పత్రి అరగంట ఆలస్యంగా విధులకు రాగా.. రోగులు ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుదీప్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డా. రహీంను రోగుల ముందే ధూషించగా మనస్థాపానికి గురయ్యాడు. ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ వ్యవహారశైలితో విసుగుచెంది డా. రహీం, డా. తరుణ్, డా. లోకేష్ తాము విధులు నిర్వర్తించలేమని ఈ నెల 19న తమ వృత్తులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లా అధికారులఆదేశాలు అమలు చేశా..
ఆస్పత్రిలో పనిచేసే ముగ్గురు వైద్యులు రాజీనామా చేసిన విషయం వాస్తవమే. జిల్లా ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు కొంత కఠినంగా వ్యవహరించి రోగులకు వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నాం. రోజురోజుకు రోగుల సంఖ్య పెరగడంతో మెరుగైన సేవల కోసం వైద్యులపై ఒత్తిడి ఉంటుంది. విధుల ని ర్వహణలో సమయపాలన విషయంలో తప్ప వైద్యులతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడ వలు లేవు. ఈ విషయం జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.
– డా. అనుదీప్,
ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్, కోస్గి
సూపరింటెండెంట్ వ్యవహారశైలేకారణమా?
Comments
Please login to add a commentAdd a comment