బరంపురం: కళలు, సాహిత్యం, సంస్కృతి, శక్తిపీఠాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గంజాం జిల్లాలో మరో పర్యాటక ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి నవీన్ పటా్నయక్ ప్రాతినిధ్యం వహిస్నుత్న ఈ జిల్లాలోని రతణయ్ కొండల్లో ఉన్న అతిపురాతన మా రతణమయి అమ్మవారి శక్తిపీఠం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5కోట్లు మంజూరు చేసింది. దశాబ్ధాల చరిత్ర ఉన్న ఈ శక్తిపీఠాన్ని ఆధ్యాతి్మకంగా, పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ బాధ్యతలను కలెక్టర్ విజయ్‌కుమార్ కులంగాకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో సన్నోఖేముండి సమితి లకాడి అటవీ ప్రాంతంలో ఉన్న రతణయ్ కొండల్లో కొలువైన శక్తిపీఠాన్ని కలెక్టర్ విజయ్ కులంగా శనివారం సందర్శించారు. సుమారు 5 గంటల పాటు అటవీప్రాంతంలో కాలినడక సాగించి శక్తిపీఠాన్ని చేరుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించారు.
ఇతర శక్తిపీఠాల మాదిరిగా..
జిల్లాలో ప్రసిద్ధి చెందిన తరతరిణి, బాలకుమారి అమ్మవారి శక్తిపీఠం మాదిరిగా రతణయ్ కొండల్లో కొలువైన రతణమయి అమ్మవారి శక్తిపీఠాన్ని అభివృద్ధి చేయనున్నారు. భక్తులు, సందర్శకులు కొండపైకి నేరుగా చేరుకునేందుకు రహదారి నిర్మించనున్నారు. హిందూ సంప్రదాయం ఉట్టిపడేలా కొత్తగా ఆలయాన్ని నిర్మించనున్నారు. తాగునీరు, విద్యుత్, చి్రల్డన్ పార్క్, భక్తులు కొండపైకి వెళ్లేందుకు మెట్లు, ప్రహరీ, వాహనాల పార్కింగ్, శాంతిభద్రతలు పర్యవేక్షించేందుకు పోలీసు ఔట్‌పోస్టు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమ్మవారికి నిత్య పూజలు, దీపారాధన చేసేందుకు పూజారిని నియమించనున్నారు. శక్తిపీఠం అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. కమిటీ చైర్మన్‌గా సన్నోఖేముండి బ్లాక్ తహసీల్దార్, బీడీఓ, స్థానిక సర్పంచ్‌లు, సమితి సభ్యులతో పాటు గ్రామ పెద్దలను నియమించటం జరుగుతుందన్నారు. రతణయ్ కొండకు ఆధ్యాత్మికంగా, పర్యాటక గుర్తింపు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment