![46951 New Corona Cases Recorded In India - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/22/32.jpg.webp?itok=cuSiNO4J)
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,951 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081కు చేరింది. గత నవంబర్ తర్వాత మళ్లీ ఇంత పెద్ద మొత్తం కేసులు రావటం ఇదే ప్రథమం. ఇప్పటివరకు కరోనానుంచి కోలుకుని 1.11 కోట్లమంది ప్రజలు బయటపడ్డారు. మృతుల సంఖ్య 1,59,967కు చేరింది. ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 30,535 కేసులు వచ్చాయి.
మహారాష్ట్ర తర్వాతి స్థానంలో పంజాబ్ (2,644), కేరళ(1,875) కర్ణాటక(1,715) గుజరాత్(1580)లు ఉన్నాయి. కేసుల పెరుగున్న వేగం దృష్ట్యా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పలు ప్రాంతాలో మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కాగా, మరికొద్దిరోజుల్లో ఉత్తరాఖండ్‌లో జరగనున్న కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాని కొన్ని సూచనలు చేసింది. పెద్ద మొత్తం భక్తులు ఒక చోట చేరనున్న నేపథ్యంలో కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
చదవండి : త్వరలో కుంభమేళ.. ఈ సూచనలు పాటించాలి
Comments
Please login to add a commentAdd a comment