న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. శనివారం ఒక్క రోజే 40,953 కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికి పైగా మహారాష్ట్రలో వచ్చినవే. ఇక గడిచిన 24 గంటల్లో 188 మంది మృత్యువాతపడగా.. ఇప్పటివరకు మొత్తం 1,59,404 మంది మరణించారు. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, న్యూఢిల్లీ, పంజాబ్, మధ్య ప్రదేశ్‌లలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 గంటల్లో 800లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదుకావటం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి.
మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిన్న ఒక్కరోజే 25,681 కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో మళ్లీ లాక్‌డౌన్ విధించింది. అయితే ప్రజల లెక్కలేని తనం కారణంగానే కరోనా వైరస్ మళ్లీ పెచ్చుమీరుతోందని వైద్యులు చెబుతున్నారు. మాస్కులు ధరించటం, సోషల్ డిస్టన్స్ పాటించటం ద్వారా మాత్రమే కరోనాను అరికట్టగలమని అంటున్నారు.
చదవండి : మళ్లీ కరోనా విజృంభణ; ఆస్పత్రుల్లో భారీగా బెడ్లు రెడీ!
Comments
Please login to add a commentAdd a comment