ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ –19 మహమ్మారి మూడో వేవ్‌లో ఐదు లక్షల మంది పిల్లలతో సహా 50 లక్షల మందికి కరోనా సోకే అవకాశం ఉందని రాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రాజేంద్ర షింగ్నే పేర్కొన్నారు. శుక్రవారం బుల్ధానాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడో వేవ్‌లో గరిష్ట స్థాయిలో ఎనిమిది లక్షల యాక్టివ్ కేసులు ఉండవచ్చని తెలిపారు.
ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించామని చెప్పారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం, తగిన మందుల నిల్వను సమకూర్చుకోవడంతోపాటు శిశువైద్యులతో సహా ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని సంసిద్ధులను చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment