పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి | 68,500 New Cases In Maharashtra, Another Record Spike | Sakshi
Sakshi News home page

పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి

Published Tue, Apr 20 2021 1:17 AM | Last Updated on Tue, Apr 20 2021 1:57 PM

68,500 New Cases In Maharashtra, Another Record Spike - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ భయాందోళనలకు గురిచేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఆదివారం ఒక్కరోజే టర్కీలో 55,802 కొత్త కేసులు, అమెరికాలో 43,174, బ్రెజిల్‌లో 42,937, ఫ్రాన్స్‌లో 29344, ఇరాన్‌ 21,644 కేసులు నమోదవగా, అదే మహారాష్ట్రలో ఏకంగా 68,531 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతంగా మారింది. మరోవైపు మృతుల సంఖ్య కూడా 503కి చేరింది. 

ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి.. 
మహారాష్ట్రలో ప్రతి మూడు నిమిషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారు. మరోవైపు ఒక గంటలో సుమారు మూడు వేల మందికి కరోనా సోకుతుంది. 24 గంటల్లో నమోదైన కరోనా రోగుల సంఖ్య లెక్కల ప్రకారం మహారాష్ట్రలో పరిస్థితి భయానకంగా మారుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో మృత్యు శాతం 1.58 ఉంది. మరోవైపు 90 శాతానికిపైగా ఉండే రికవరీ రేట్‌ 80.92 శాతానికి పడిపోయింది.  

చదవండి: (రెండ్రోజుల్లో నిర్ణయం.. సంపూర్ణ లాక్‌డౌన్‌కే మొగ్గు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement