ప్రజలు నిశ్శబ్దాన్ని వీడాలి: సోనియా | 75th Independence Day 2021 Sonia Gandhi Special Message | Sakshi
Sakshi News home page

ప్రజలు నిశ్శబ్దాన్ని వీడాలి: సోనియా

Published Tue, Aug 17 2021 2:24 PM | Last Updated on Tue, Aug 17 2021 2:24 PM

75th Independence Day 2021 Sonia Gandhi Special Message - Sakshi

న్యూఢిల్లీ: ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం పాపమని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రమంటే అర్ధం తెలుసుకోవాలని ప్రజలను కోరారు. దేశ ప్రజాస్వామ్యానికి రిపేర్లు అవసరమన్నారు. 75వ స్వతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఒక ఆంగ్ల పత్రికలో రాసిన కథనంలో ఆమె తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం పార్లమెంట్‌పై దాడి చేసి, సాంప్రదాయాలను భంగపరిచి, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న తరుణంలో ప్రజలు స్వాతంత్య్రానికి నిజమైన అర్ధం తెలుసుకోవాన్నారు.

మోదీ హయంలో జర్నలిస్టులకు, మేథావులకు, పార్లమెంటసభ్యులకు.. ఇలా ఎవరికీ వాక్‌స్వాతంత్య్రం లేదని ఆమె విమర్శించారు. ఆక్సిజన్‌కొరత, జీఎస్‌టీ తదితర అంశాలపై పార్లమెంట్‌లో అభిప్రాయాలు వ్యక్తం చేసుకునే అవకాశమే ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి చేస్తున్న డ్యామేజీని రిపేరు చేయాలని, ఇందుకు అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కొన్ని దశాబ్దాలుగా సాధించిన వృద్ధి మోదీ వల్ల కనుమరుగైందని ఆరోపించారు. ఏడేళ్లుగా చర్చల్లేకుండా చట్టాలు వస్తున్నాయని సోనియా వాపోయారు. దీనివల్ల పార్లమెంటు రబ్బరు స్టాంపుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ కట్టడిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించేందుకు ప్రభుత్వం ముందుకురాలేదని విమర్శించారు. పలు ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలను మోదీ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోందని సోనియా ఆరోపించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement