
వధూవరులు పీటర్ లాక్కర్, అఖిలతో కుటుంబ సభ్యులు
సాక్షి, చెన్నై: అమెరికాకు చెందిన అబ్బాయి తమిళనాడుకు చెందిన యువతి తమిళ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. చెన్నై మాధవరం సమీపంలో నివసించే నాగర్‌కోవిల్‌కు చెందిన రిటైర్డ్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రన్ కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అఖిల (28) అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే మిచిగాన్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పీటర్ లాక్కర్ (30)తో పరిచయం ప్రేమగా మారింది.
ఇరుపక్షాల పెద్దలు అంగీకరించడంతో చెన్నై టీనగర్‌లోని స్టార్ హోటల్లో శుక్రవారం వీరి వివాహం జరిగింది. వరుడి కుటుంబీకులు సైతం తమిళ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించడం విశేషం. ‘మవుళి కల్యాణమాలై శుభాకాంక్షలు’ అనే పాట ప్రసారం అవుతుండగా వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. వివాహానంతర కార్యక్రమాలను తమిళ సంప్రదాయంలో కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment