జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 2019 ఆగస్టు 5న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ చారిత్రక ఘట్టానికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పలువురు బీజేపీ నేతలు తమ స్పందనలు తెలియజేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, ‘ఇది మా(బీజేపీ) ఎజెండాలో ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీని కోసమే తన జీవితాన్ని త్యాగం చేశారు. నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించి స్థానికులకు స్వేచ్ఛ కల్పించారు’ అని అన్నారు.
#WATCH | Raipur: Chhattisgarh CM Vishnu Deo Sai says "Today is the third Monday of the 'Sawan' month. I want to extend my wishes to the people of the state. I am travelling to to Kawardha along with Deputy CM Vijay Sharma wherein we will offer prayers to Lord Shiva..."
On 5… pic.twitter.com/VC0jJIDzXh— ANI (@ANI) August 5, 2024
జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా మాట్లాడుతూ ‘2019, ఆగస్టు 5 న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఫలితంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రతి వ్యక్తికి హక్కులు లభించాయి. ఆర్టికల్ 370 తీసుకురావడం ద్వారా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు జమ్ముకశ్మీర్ ప్రజలకు ద్రోహం చేశాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోదీ ‘వన్ ఇండియా-బెస్ట్ ఇండియా’ సంకల్పాన్ని నెరవేర్చారు’ అని అన్నారు.
జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ‘ఈరోజు చరిత్రాత్మకమైన రోజు. ఆర్టికల్ 370, 35ఏలను తొలగించడం ద్వారా జమ్ము, కశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తీవ్రవాదం అదుపులోకి వచ్చింది. వేర్పాటువాదులు జైలులో ఉన్నారు. స్థానికులు ఉపాధి పొందుతున్నారు. లోయలో శాంతి నెలకొంది’ అని అన్నారు.
#WATCH | On the 5th anniversary of the abrogation of Article 370, former Deputy CM of Jammu and Kashmir and BJP leader Nirmal Singh says, "Today is a very historic day. Today on 5 August 2019, the Parliament removed Article 370 and 35A and implemented the Constitution of India in… pic.twitter.com/WY27a5DVZR
— ANI (@ANI) August 5, 2024
Comments
Please login to add a commentAdd a comment