పాట్నాలోని ఆర్కియాలజికల్ సర్వే కుషానుల కాలం నాటి ఇటుక గోడలను వెలికితీసింది
పాట్నా: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మిషన్ అమృత్ సరోవర్ పనుల్లో భాగంగా బీహార్‌లోని పాట్నాలో కుమ్రహర్ ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ) తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో ఒక పురాతనమైన గోడల అవశేషాలు బయటపడ్డాయి. ఇవి రెండు వేల ఏళ్ల నాటి మౌర్య సామ్రాజ్యపు గోడల అవశేషాలని ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య అన్నారు. అంతేకాదు బహుశా కుషాన్ యుగం నుంచి కూడా ఉండవచ్చని చెబుతున్నారు.
వాస్తవానికి మిషన్ అమృత్ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా పాట్నాలో రక్షిత చెరువులను పునరుజ్జీవింప చేసే పనులను చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా ఈ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చెరువులో ఈ పురాతన గోడల అవశేషాలు గుర్తించామని చెప్పారు. ఈ గోడలోని ఇటుకలు క్రీస్తు శకం 30వ శతాబ్దం నుంచి 375 కాలంలోని మధ్య ఆసియా(అంటే ప్రస్తుత ఆప్గనిస్తాన్)ని పాలించిన కుషాన్ యుగానికి చెందినవని తెలుస్తోందన్నారు. ఈ విషాయాన్ని న్యూఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారులకు కూడా తెలియజేశాం అని గౌతమి పేర్కొన్నారు. ఈ మేరకు బీహార్‌లోని పాట్నాలో మొత్తం పదకొండు రక్షిత నీటి వనరులను పునరుజ్జీవింప పనులు చేపట్టింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ).
(చదవండి: ఈ జంట మరీ వైల్డ్! పూల దండలుగా)
Comments
Please login to add a commentAdd a comment