
1997 నాటికి దేశ జనాభా వంద కోట్లు. ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వెండితెరలు కేవలం 12,500. పది లక్షల జనాభాకు సగటున 13 థియేటర్లు కూడా లేని ఆ కాలంలో మెల్లిగా మల్టీప్లెక్స్‌లు అవతరించడం మొదలైంది. ఒక్కోటి కనీసం 35 కోట్ల రూపాయల అంచనా వ్యయమయ్యే మల్టీపెక్ల్‌లు ఆ ఏడాది కొన్ని పదుల సంఖ్యలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రేక్షకుల కోసం ఎలివేటర్‌లను సిద్ధం చేశాయి. దీంతో సినిమాను వీక్షించే తీరే మారిపోయింది.
భారీ బడ్జెట్ చిత్రాలను భారీ మల్టీపెక్స్ సినిమా హాళ్లలో మాత్రమే చూడాలనే తరం బయల్దేరింది. మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను దృష్టి ఉంచుకుని నిర్మాతలు సినిమాలు తీయడం అనే కొత్త ధోరణి కూడా అప్పుడే మొదలైంది. 1990ల ద్వితీయార్థంలో మల్టీప్లెక్స్‌లకు మాల్స్ చేదోడుగా ఉంటే, కరోనా అనంతరం మాల్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్‌లకు చేదోడు అవుతున్నాయి.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
మదర్ థెరెసా వారసురాలిగా సిస్టర్ నిర్మలను ఎంచుకున్న మిషనరీస్ ఆఫ్ ఛారిటీ. ప్రధాని హెచ్.డి. దేవెగౌడ నాయకత్వం బలహీనంగా ఉందన్న కారణంతో ‘యునైటెడ్ ఫ్రంట్’కు మద్దతు ఉపసంహరించుకున్న కాంగ్రెస్ పార్టీ. కొత్త ప్రధానిగా ఐ.కె.గుజ్రాల్. రాష్ట్రపతిగా కె.ఆర్. నారాయణన్. ప్రత్యర్థి టి.ఎన్.శేషన్ ఓటమి. మదర్ థెరెసా మరణం.
(చదవండి: బోస్ భుజాల మీద హిట్లర్ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?)
Comments
Please login to add a commentAdd a comment