మందిరం నిర్మించకపోతే నిరాహార దీక్ష  | Bhaskara Tirtha Lakshmi Baba Protest For Temple In Odisha | Sakshi
Sakshi News home page

మందిరం నిర్మించకపోతే నిరాహార దీక్ష 

Published Wed, Feb 3 2021 11:00 AM | Last Updated on Wed, Feb 3 2021 11:00 AM

Bhaskara Tirtha Lakshmi Baba Protest For Temple In Odisha - Sakshi

కూల్చివేసిన పురాతన జగన్నాథ మందిరం

పర్లాకిమిడి: రాజవీధిలోని ప్యాలెస్‌కి ఎదురుగా జగన్నాథ మందిరం నిర్మాణం చేపట్టకపోతే నిరాహార దీక్ష చేస్తానని మహేంద్రగిరి భాస్కర తీర్థ లక్ష్మీబాబా హెచ్చరించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్కడి అతి పురాతన జగన్నాథుని మందిరాన్ని కూల్చివేశారు. అప్పటి నుంచి ఆ స్థలంలో ఎటువంటి కట్టడాలు జరపకపోగా ఇప్పుడు ఆ స్థలం చెరువుని తలపిస్తోంది. ఆ తర్వాత పాలకులు, అధికారులు పలు సమావేశాల్లో పాత జగన్నాథుని మందిరం స్థానంలో కొత్తగా జగన్నాథుని మందిరం నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

భాస్కర తీర్థ లక్ష్మీబాబా    
అయితే ఇంతవరకు ఆ స్థానంలో మందిర నిర్మాణం జరగలేదు. దీనిపై స్థానికులు, జగన్నాథుని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీరికి మద్దతుగా నిలిచిన భాస్కర తీర్థ లక్ష్మీబాబా ఈ నెల 20వ తేదీలోగా మందిరం నిర్మాణ పనులు ప్రారంభించాలని లేకపోతే 21వ తేదీ నుంచి గజపతి ప్యాలెస్‌ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement