
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. తర్వాత రాష్ట్రాభివృద్ధికే పనిచేయాలి
వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడతాం
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజబుల్ కాదని మూడు కమిటీలు చెప్పాయి
సీఐఐ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్రంతో ఘర్షణ వాతావరణం లేకుండా పనిచేస్తాం: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలే తప్ప, ఎన్ని కల తర్వాత అందరూ కలిసి రాష్ట్రాభివృద్ధికే పనిచే యాలని ఆయన సూచించారు. గురువారం సాయ ంత్రం ఢిల్లీలో సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఎంపీలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరిగింది.
ఇందులో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లురవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవి చంద్ర, పార్థసారథి, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్‌లో టూరిజం, ఐటీ, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల అభివృద్ధిపై ఫోకస్ చేస్తు న్నామని, వీలైనంత త్వర గా వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపడతామని తెలిపారు.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వయబుల్ కాదని 3 కమిటీలు సిఫారసు చేశాయని.. ఫీజబుల్ కాదని చెప్పిన తర్వాత ప్రజల డబ్బు వృథా చేయకూడదని వ్యాఖ్యానించారు. నష్టం వస్తుందని తెలిసి ఎవరూ పరిశ్రమ పెట్టరని.. బయ్యారం ఫీజబుల్ అయితే తానే కేంద్రం నుంచి స్వయంగా నిధులు తీసుకొచ్చేవాడినని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడుస్తాం: మల్లు రవి
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, రాష్ట్ర అభి వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడుస్తా మనీ, కేంద్రంతో ఘర్షణ వాతావరణం లేకుండా పనిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. మహబూబ్ నగర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై ఒక బుక్ తయారు చేయించామని, అది బీజేపీ ఎంపీలకు ఇస్తామని మల్లురవి చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లా డుతూ, పెద్దపల్లిలో సీఐఐ కార్యాలయం ప్రారంభిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, భద్రాచలం సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.50 కోట్లు సరిపోవని, ఈ మొత్తాన్ని ఇంకా పెంచాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment