లక్నో: ఆయనకు 45 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. అయితే రాజకీయ భవిష్యత్తు కోసం అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది.. అది కూడా కేవలం 45 గంటల్లోనే. వినడానికి వింతగా ఉన్నా ఇది జరగబోతుంది. వివరాల్లోకి వెళితే...ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ మున్సిపల్ సీటును మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో ప్రస్తుతం దాని అధ్యక్షుడిగా ఉన్న మామున్ ఖాన్‌కు వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా 45 గంటల్లోనే వెతుక్కోవడం గమనార్హం.
గత మూడు దశాబ్దాలుగా రాంపూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్న ఖాన్, తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి తన ప్రణాళికలను ప్రకటించారు. ఆ సీటు మహిళలకు కేటాయించడంతో చేసేదేమి లేక 45 గంటల్లోనే తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు. మహిళలకు రిజర్వేషన్ ప్రకటించే వరకు స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపారు.
మునిసిపల్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రకటించిన తర్వాత ఈ ఘటన జరిగింది. నామినేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 17, ఖాన్ వివాహం ఏప్రిల్ 15 జరగనుంది. మామున్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు, తన వివాహం రెండింటికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఒక మహిళకు సీటు తప్పనిసరి అయినందున, అతను తన పెళ్లిని ప్రకటించవలసి వచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment