
న్యూఢిల్లీ: దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసు ఇవ్వొచ్చా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సార్స్–కోవ్–2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్ (ఇన్సాకాగ్) చెందిన శాస్త్రవేత్తల బృందం సిఫారసు చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు రంగాల్లో వ్యక్తులకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇన్సాకాగ్ తన వారాంతపు నివేదికలో చెప్పింది. లోక్‌సభ ఎంపీలు బూస్టర్ డోసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇన్సాకాగ్ ఈ సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా వైరస్‌లోని జన్యుక్రమాలను పరీక్షించడానికి ఇన్సాకాగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వేరియెంట్ కేసులు దేశంలోకి ప్రవేశించాయన్న విషయాన్ని త్వరితగతిన తెలుసుకోవడం కష్టసాధ్యమని, అందుకే కరోనా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment