consortium
-
క్రికెట్ జట్టు కోసం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బిడ్ దాఖలు
ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్టియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ లేదా ‘లండన్ స్పిరిట్’ టీమ్‌ల కోసం 80 మిలియన్ పౌండ్ల (97 మిలియన్ డాలర్లు-రూ.805.1 కోట్లు) బిడ్ వేస్తోంది.ఈ కన్సార్టియంకు పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ ఎనిమిది జట్లలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీఈ) చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.100-బాల్ ఫార్మాట్‌తో ‘ది హండ్రెడ్’100-బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది స్కై స్పోర్ట్స్, బీబీసీలో ప్రసారం అవుతుంది.ఇదీ చదవండి: ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలుటెక్ కంపెనీ సీఈఓలకు ఆసక్తిసుందర్ పిచాయ్‌కు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథులు క్రికెట్‌పై ఆసక్తిగా ఉంటూ దాన్ని మరింత మందికి చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిగాఉండగా, ఈసీబీ ప్రతి జట్టులో 49 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. -
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
అమెరిలో ఏప్రిల్ 27 వ తారీకు సాయంత్రం (భారత దేశ కాలమానము ఏప్రెల్ 28 ఉదయము) తొలి ప్రపంచ తెలుగు సమితి, "వరల్డ్ తెలుగు కన్సార్టియం" అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.ఎనిమిది దేశాలకు చెందిన 27మంది వక్తలు, సంధానకర్తలతో సభ కళ కళ లాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ , తెలుగు సాహిత్య ప్రపంచం లోని అతిరధ, మహారధులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనల పై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.ఈ సమావేశాన్ని యూట్యూబ్ లో వీక్షించవచ్చు. -
జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు మరో 100 కోట్లు
ముంబై: జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను పునరుద్ధరించే దిశగా జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) మరో రూ. 100 కోట్లు సమకూర్చింది. దీనితో, కోర్టు ఆమోదిత పరిష్కార ప్రణాళిక ప్రకారం మొత్తం రూ. 350 కోట్లు సమకూర్చినట్లయిందని జేకేసీ తెలిపింది. కంపెనీపై పూర్తి అధికారాలు దక్కించుకునేందుకు అవసరమైన నిబంధనలన్నింటినీ పాటించినట్లయిందని పేర్కొంది. ఎయిర్‌లైన్ కార్యకలాపాల పునరుద్ధరణ ప్రణాళికలో ఎటువంటి మార్పులు ఉండవని, వచ్చే ఏడాది (2024) నుంచి ప్రారంభించేందుకు కొత్త ప్రమోటర్లు దృఢనిశ్చయంతో ఉన్నట్లు జేకేసీ వివరించింది. లాంచ్ తేదీని రాబోయే వారాల్లో ప్రకటించనున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంక్షోభంతో దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు 2019 ఏప్రిల్ 17 నుంచి నిల్చిపోయిన సంగతి తెలిసిందే. -
జపనీస్ కంపెనీల చేతికే తోషిబా
సుమారు 140 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన జపనీస్ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్‌ను చేయి జారిపోకుండా చూసేందుకు ఆ దేశ సంస్థలే ఏకమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం సైతం చేయూత నందించింది. వెరసి పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ ఇంక్ అధ్యక్షతన ఏర్పాటైన కన్సార్షియం 2 ట్రిలియన్ యెన్ల(15.3 బిలియన్ డాలర్లు) విలువలో కొనుగోలు చేసేందుకు బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌ను తోషిబా బోర్డు అంగీకరించింది. ఇతర వివరాలు చూద్దాం.. టోక్యో: గత కొన్నేళ్లుగా పలు సంక్షోభాలను చవిచూస్తున్న ప్రయివేట్ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్ప్‌ను స్వదేశీ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి. పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(జేఐపీ) ఇంక్ ఆధ్వర్యంలో గ్రూప్‌గా ఏర్పడిన 20 సంస్థలు 15.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 1,26,225 కోట్లు) బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌కు తాజాగా తోషిబా కార్ప్ బోర్డు ఓకే చెప్పింది. బిడ్ చేసిన కన్సార్షియంలో ఓరిక్స్ కార్ప్, రోహ్ కో, చుబు ఎలక్ట్రిక్ పవర్ తదితరాలున్నాయి. తోషిబా షేరు గురువారం ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం ప్రీమియంతో ఆఫర్ ఇచ్చాయి. కొన్నేళ్లుగా రకరకాల కుంభకోణాలు బయటపడటంతో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫలితంగా కంపెనీ అమ్మకపు బాటలో పడింది. తోషిబా యాజమాన్యం, జపనీస్ ప్రభుత్వం, వాటాదారులు కంపెనీ భవిష్యత్‌పట్ల ఆందోళనలు చవిచూస్తున్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు గరిష్ట రిటర్నులు ఆశిస్తుంటే.. జపనీస్ ప్రభుత్వం మాత్రం కీలకమైన సాంకేతికతలు, బిజినెస్‌లను విదేశీ హస్తాలకు చేరకుండా పరిరక్షించే యోచనలో పడింది. తోషిబా బిజినెస్ వ్యూహాలలో పలుమార్లు మార్పులు చోటుచేసుకోవడంతో స్థిరత్వం లోపించినట్లు లైట్స్ట్రీమ రీసెర్చ్ విశ్లేషకులు మియో కటో పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వృద్ధి అవకాశాలను అందుకునేందుకు వీలుగా వర్ధమాన బిజినెస్‌లకు అనుగుణమైన చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రత తోషిబా అణు విద్యుత్(న్యూక్లియర్ పవర్) బిజినెస్ జాతీయ భద్రతకు చెందిన ప్రధాన అంశమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2011 భూకంపం, సునామీ ధాటికి శిథిలమైన ఫకుషిమా దాయ్చీ ఆటమిక్ పవర్ ప్లాంటు మూసివేతలో కంపెనీ సేవలందించింది. ఈ నేపథ్యంలో తోషిబా యాజమాన్య నియంత్రణ విదేశీయుల చేతికి వెళ్లకుండా నిరోధించేందుకు జపనీస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కాగా.. డీల్ పూర్తయితే ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానుంది. అంతేకాకుండా ఈ డీల్ జపాన్ చరిత్రలోనే అతిపెద్ద పీఈ పెట్టుబడుల కొనుగోలుగా రికార్డు నెలకొల్పనుంది. అయితే ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా జేఐపీ కన్సార్షియంకు ఫైనాన్స్ అందించేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ పాలన జపాన్‌లో కార్పొరేట్ పాలనపై తోషిబా వ్యవహారాన్ని పరిశీలనాత్మక కేసుగా పరిగణించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సుప్రసిద్ధ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు దీనికి ఒక అవకాశంగా తీసుకుని కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో బిలియనీర్ పాల్ సింగర్ సంస్థ ఇలియట్ మేనేజ్మెంట్ కార్ప్, సేథ్ ఫిషర్‌కు చెందిన ఒయాసిస్ మేనేజ్మెంట్ కో, సింగపూర్ ఫండ్స్ ఎఫిసిమో క్యాపిటల్ మేనేజ్మెంట్ పీటీఈ, 3డీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ను పేర్కొన్నారు. కంపెనీ కొనుగోలుకి ఆఫర్లు ప్రకటించిన గ్లోబల్ పీఈ దిగ్గజాలలో బెయిన్ క్యాపిటల్, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో ఉన్నట్లు వెల్లడించారు. 8 ఏళ్లుగా సవాళ్లు గత ఎనిమిదేళ్లుగా తోషిబా ఒకదాని తరువాత మరొకటిగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. 2015లో ఖాతాల కుంభకోణం బయటపడ్డాక లాభాలు ఆవిరయ్యాయి. ఇది కంపెనీ పునర్వ్యవస్థీకరణకు కారణమైంది. తదుపరి వ్యయభరితమైన యూఎస్ న్యూక్లియర్ పవర్ బిజినెస్‌లోకి ప్రవేశించడం దెబ్బతీసింది. వెరసి 6.3 బిలియన్ డాలర్లను రైట్‌డౌన్ చేయవలసి వచ్చింది. దీంతో ఒక దశలో కంపెనీ డీలిస్టింగ్వరకూ వెళ్లింది. కంపెనీకి ఎంతో విలువైన, కీలకమైన మెమొరీ చిప్ యూనిట్‌తోపాటు, విదేశీ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించవలసి వచ్చింది. ఆపై వాటాదారులు, ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భవిష్యత్ విషయంలో వివాదాలు తలెత్తాయి. కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరిని, ఇతరులను 2020లో తోషిబా బోర్డులో చేర్చుకోమంటూ ఎఫిసిమో ఒత్తిడి చేసింది. అయితే దీనిని వాటాదారులు వ్యతిరేకించారు. అనుమానాస్పద రీతిలో సాగిన ఓటింగ్‌పై ఎఫిసిమో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇక కంపెనీని విక్రయించకుండా రెండుగా విడదీసేందుకు యాజమాన్యం చేసిన ప్రతిపాదనను గతేడాది వాటాదారులు తిరస్కరించారు. దీంతో కంపెనీని విక్రయించవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దశలో జేఐపీ రంగంలోకి దిగింది. గతేడాది అక్టోబర్‌లో ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో కెరీర్ ప్రారంభించిన హిడెమీ మో 2002లో జేఐపీని ఏర్పాటు చేశారు. -
దేశంలో కరోనా కొత్త వేరియంట్.. ఫోర్త్ వేవ్ వస్తుందా?
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తెలిపింది. ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని పేర్కొంది. 76 కేసుల్లో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కోటి ఉన్నాయి. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ మొదటగా జనవరిలో 2 శాంపిళ్లలో బయటపడింది. ఫిబ్రవరిలో 59కి చేరింది. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడ్డట్టు ఇన్సాకాగ్ పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ మాజీ కన్వీనర్ విపిన్ ఎం. వశిష్ట చెప్పారు. ఈ వేరియంట్ కారణంగా దేశంలో గత 14 రోజుల్లో కేసులు 281%, మరణాలు 17% పెరిగాయని ట్వీట్ చేశారు. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం. యాక్టివ్ కేసులు 5,389కు చేరాయని కేంద్రం తెలిపింది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సుల కోసం వినతి
సాక్షి, అమరావతి: ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల సమస్యలు పరిష్కారమయ్యేలా ఉన్నత విద్యామండలి తోడ్పాటు అందించాలని ఆ కాలేజీల కన్సార్టియం విన్నవించింది. యూజీసీ నుంచి వచ్చిన అటానసమ్ స్టాటస్ క్రియాశీలకంగా ఉన్నంత కాలం యూనివర్సిటీలు శాశ్వత గుర్తింపు ఇచ్చేలా చూడాలని కోరింది. విజయవాడలో సోమవారం కాకినాడ, అనంతపురం జేఎన్టీయూల పరిధిలోని ప్రైవేట్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రతినిధులతో ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి సమావేశమయ్యారు. కాలేజీల కన్సార్టియం అధ్యక్షుడు చొప్పా గంగిరెడ్డి, కార్యదర్శులు జీవీఎం మోహన్‌కుమార్, మిట్టపల్లి వి.కోటేశ్వరరావు, ఎన్.సతీష్‌రెడ్డి, ఇతర ప్రతినిధులు కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. శాశ్వత గుర్తింపుతోపాటు యూజీసీ నిబంధనలను అనుసరించి యూనివర్సిటీలు అకడమిక్ స్వయం ప్రతిపత్తి ఇచ్చేలా చూడాలన్నారు. నూతన విద్యావిధానం ప్రకారం 2035 నాటికి జీఈఆర్‌ను 50 శాతం మేర సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నందున ప్రస్తుత అటానమస్ కాలేజీలను యూజీసీ, రాష్ట్ర యూనివర్సిటీ చట్టాల నిబంధనల మేరకు ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారేందుకు ప్రభుత్వానికి నివేదించాలన్నారు. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అభివృద్ధి చెందుతున్న అంశాలకు సంబంధించిన డిగ్రీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశమివ్వాలని కోరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, 3డీ ప్రింటింగ్, డిజైనింగ్, వర్చువల్ రియాలిటీలతో నాన్‌టెక్నికల్ యూజీ, పీజీ కోర్సులను నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. (చదవండి: -
జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం బదిలీకి ఎన్సీఎల్టీ ఆమోదం
ముంబై: దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కులను జలాన్ కల్రాక్ కన్సార్షియానికి బదిలీ చేసే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. అలాగే రుణదాతలు, ఉద్యోగులు మొదలైన వారికి బాకీలు చెల్లించడానికి మరికొంత సమయం ఇచ్చింది. దీంతో బాకీల చెల్లింపునకు కన్సార్షియానికి మే నెల వరకూ వ్యవధి లభించింది. గతంలో ఈ గడువు 2022 నవంబర్ 16గా ఉండేది. కన్సార్షియం, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తాజా ఉత్తర్వులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దివాలా పరిష్కార ప్రక్రియ కింద జెట్ ఎయిర్వేస్ను జలాన్ కల్రాక్ కన్సార్షియం దక్కించుకున్న సంగతి తెలిసిందే. 2021 జూన్‌లో ఆమోదించిన ప్రణాళిక ప్రకారం బ్యాంకులు రూ. 7,807 కోట్ల మేర బాకీలను వదులుకునేందుకు (హెయిర్‌కట్) అంగీకరించాయి. రుణదాతలకు చెల్లింపులతో పాటు వ్యాపారానికి కన్సార్షియం రూ. 1,375 కోట్ల మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ యాజమాన్య హక్ులను తమకు బదిలీ చేయాలని, బాకీల చెల్లింపునకు మ రింత సమయం ఇవ్వాలని ఎన్సీఎల్టీని కన్సార్షి యం ఆశ్రయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై రెండు వారాల పాటు స్టే విధించాలని ప్రతివాదులు కోరినప్పటికీ ఎన్సీఎల్టీ తిరస్కరించింది. -
ఎయిర్పోర్ట్ మెట్రోపై ‘విదేశీ’ ఆసక్తి.. జనరల్ కన్సల్టెంట్‌దే కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించే జనరల్ కన్సల్టెంట్ నియామకానికి సంబంధించి నిర్వహించిన అర్హత అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్)కు పలు విదేశీ సంస్థల నుంచి పలు బిడ్లు దాఖలయ్యాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలున్నాయి. మొత్తంగా 13 ప్రతిష్టాత్మక దేశ, విదేశీ సంస్థలు అయిదు కన్సార్షియంలుగా ఏర్పడి ప్రీ క్వాలిఫికేషన్ బిడ్లు దాఖలు చేసినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆయా కన్సార్షియంలు దాఖలు చేసిన బిడ్లను మూల్యాంకన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ బిడ్ దాఖలు చేసిన కన్షార్షియంలు ఇవే.. ►సిస్ట్రా (ఫ్రాన్స్), ఆర్ఐటీఈఎస్ (ఇండియా, డీబీ ఇంజినీరింగ్ అండ్ కన్సల్టింగ్(జర్మనీ). ►ఆయేసా ఇంజనెర్సియా ఆర్కెటెక్ట్రా (స్పెయిన్),నిప్పాన్ కోయి (జపాన్), ఆర్వీ అసోసియేట్స్ (ఇండియా). ►టెక్నికా వై ప్రోయెక్టోస్ (టీవైపీఎస్ఏ–స్పెయిన్), పీనీ గ్రూప్ (స్విట్జర్లాండ్). ►ఏఈకామ్ ఇండియా, ఈజిస్ రెయిల్(ఫ్రాన్స్), ఈజిస్ ఇండియా. ►కన్సల్టింగ్ ఇంజినీర్స్ గ్రూప్ (ఇండియా), కొరియా నేషనల్ రైల్వే (సౌత్ కొరియా). జనరల్ కన్సల్టెంట్ నిర్వహించాల్సిన విధులివే.. ►హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్‌కు అన్ని సాంకేతిక, ప్రాజెక్ట్ నిర్వహణ సంబంధిత విధుల్లో జనరల్ కన్సల్టెంట్ ఏజెన్సీ సహాయం చేస్తుంది. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ కింది విధులు నిర్వహించాల్సిఉంటుంది. ►సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సమీక్షిస్తుంది. టెండర్ డాక్యుమెంటేషన్ ,మూల్యాంకనం చేపడుతుంది. డిజైన్ మేనేజ్మెంట్. వివిధ రకాల కాంట్రాక్టర్లు, సరఫరాదారులు సమర్పించిన డిజైన్లు,డ్రాయింగ్ల ప్రూఫ్ చెక్ చేస్తుంది. దస్తావేజు నియంత్రణ. ►ప్రాజెక్ట్ ప్రణాళిక. ఇంటర్ఫేస్ నిర్వహణ. నిర్మాణ నిర్వహణ. నాణ్యత హామీ, నాణ్యత నియంత్రణ. ఆరోగ్యం, భద్రత నిర్వహణ, కాంట్రాక్ట్ అడ్మిని్రస్టేషన్, పునరుత్పాదక శక్తి వ్యవస్థ, లోపాలు సరిదిద్దడంతో సహా అంగీకార ప్రమాణాలు సరిపోలుస్తుంది. ఓఅండ్ఎం ప్రణాళిక. హెచ్ఏఎంఎల్, మెట్రో సిబ్బందికి శిక్షణ. ప్రాజెక్ట్ కోసం సెక్యూరిటీ ఆడిట్ మొదలైన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. -
176తో ప్రారంభమై.. 3,663కు చేరిక
సోషల్ మీడియా నుంచి ఎస్ఎంఎస్ల వరకూ దేనిలోనైనా మన భావోద్వేగాలను ఎదుటివారికి తెలియజేయాలంటే వెంటనే గుర్తొచ్చేది ఎమోజీలు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో వీటి వినియోగం ఎక్కువైపోయింది. ముఖ్యంగా వాట్సాప్‌లో చాటింగ్ చేసేటప్పుడు చాలామంది వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. సంతోషం, ప్రేమ, అసూయ.. బాధఇలా రకరకాల ఎన్నో భావాలను ఒక్క ఎమోజీతో వ్యక్తపరచవచ్చు. మాట్లాడే అవసరంలేకుండా భావోద్వేగాల్ని ఎమోజీల రూపంలో వ్యక్తపరుస్తుంటారు. సాక్షి, అమరావతి: ఎమోజీలు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయాయి. స్మార్ట్ ఫోన్ల్లో ఎన్ని అప్డేట్లు వస్తున్నా, మెసేజింగ్ యాప్‌లు ఎన్ని ఉన్నా.. ఎమోజీలు మాత్రం కామన్‌గా ఉంటున్నాయి. అవతలి వాళ్లు ఎంత పెద్ద మెసేజ్ రాసినా.. సింపుల్‌గా ఒక్క సింబల్‌తో వ్యవహారాన్ని తేల్చేయడంలోనే ఎమోజీల సత్తా దాగి ఉంది. స్పష్టమైన భావోద్వేగాలను వ్యక్తీకరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్స్ యూజర్లు ఎక్కువ మేర వాడిన ఎమోజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. స్వచ్ఛంద సంస్థ ‘యూనికోడ్ కన్సార్టియం’ 2021లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎమోజీల సమాచారాన్ని విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 92 శాతం మంది ఆన్లైన్ యూజర్లు ఎమోజీలు వినియోగిస్తున్నట్లు యూనికోడ్ కన్సార్టియం నివేదిక తెలిపింది. ఎక్కువగా వాడే ఎమోజీలు ఇవే... యూనికోడ్ కన్సార్టియం నివేదిక ప్రకారం.. ‘ఆనంద బాష్పాలు’ (‘టియర్స్ ఆఫ్ జాయ్) మొదటి స్థానంలో నిలిచింది. మిగిలిన ఎమోజీల కంటే దీనిని 5 శాతం కంటే ఎక్కువగా వాడుతున్నారు. ఇక రెండో స్థానంలో హార్ట్ (హృదయం), మూడో స్థానంలో ‘రోలింగ్ ఆన్ ది ఫ్లోర్ లాఫ్’ (నేలపై పడిపడి నవ్వుతూ), నాలుగులో థంబ్సప్ (బొటన వేలు పైకి చూపుతూ), ఐదులో లౌడ్లీ క్రయింగ్ (బిగ్గరగా ఏడుస్తూ) ఎమోజీలున్నాయి. తొలి 10 ఎమోజీల్లో మిగిలినవి వరుసగా ఫోల్డెడ్ హ్యాండ్స్ (ప్రార్థిస్తున్న చేతులు), ఫేస్ బ్లోయింగ్ ఏ కిస్ (గాలిలో ముద్దిస్తూ), స్మయిలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ (ప్రేమను కురిపించే చిరునవ్వు), స్మయిలింగ్ ఫేస్ విత్ హార్ట్స్ ఐస్ (కళ్లలో ప్రేమ), పార్టీ పాపర్(రంగుల కాగితాలు విరజిమ్మే టపాసు) ఎక్కువ ఉందిని ఆకట్టుకున్నాయి. 200 స్థానాల్లో భారీ మార్పులు ఇక వర్గాల వారీగా చూస్తే ఫ్లాగ్ (జెండాలు) 258 రకాలతో పెద్ద సమూహంగా ఉన్నప్పటికీ చాలా తక్కువగా వినియోగించారు. రాకెట్, షిప్ ఎమోజీ ట్రాన్స్పోర్ట్–ఎయిర్ సబ్సెట్లో అగ్రస్థానంలో నిలిచాయి. శరీర భాగాల్లో కండలు చూపించే ఎమోజీ తొలి స్థానం దక్కించుకుంది. చిరునవ్వు, చేతులు, మొక్కలు, పువ్వుల ఎమోజీలను తరచుగా ఉపయోగిస్తున్నారు. జంతువులు–ప్రకృతి వర్గం 53 ఎమోజీలతో రెండో అతిపెద్ద సమూహంగా ఉండగా వీటిల్లో బొకే, సీతాకోకచిలుకకు మంచి ఆదరణ లభిస్తోందని నివేదిక పేర్కొంది. 2019 నివేదికతో పోలిస్తే 200 స్థానాల్లో భారీ మార్పులు వచ్చాయని తెలిపింది. గతంలో 113 స్థానంలో ఉన్న బర్త్‌డే కేక్ 25వ స్థానానికి, 139వ స్థానంలో ఉన్న బెలూన్ 48కి, ప్లీడింగ్ ఫేస్ (వేడుకునే ముఖం) ఎమోజీ 97 నుంచి 14వ స్థానానికి ఎగబాకింది. ఆరోగ్యానికి సంబంధించి హాట్, వాజీ ఫేస్ ఎమోజీలు మాత్రమే టాప్ 100లో ఉన్నాయి. ఇక మాస్ వేర్ మాస్క్ ఎమోజీ 186 నుంచి 156వ స్థానానికి వచ్చింది. 176తో ప్రారంభమై.. 3,663కు చేరిక ఈ సంస్థ భాషకు సాంకేతిక లిపిని అందించేందుకు ఇంటర్నేషనల్ బై డైరెక్షనల్ అల్గారిథమ్ అభివృద్ధి, నిర్వహణను ప్రోత్సహిస్తోంది. కంప్యూటర్, సమాచార ఆధారిత పరిశ్రమకు చెందిన విభిన్న వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా సభ్యత్వ రుసుము మీదే ఆధారపడి నడుస్తుంది. ఇందులో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి శాశ్వత సభ్యత్వం కూడా ఉంది. యూనికోడ్ కన్సార్టియం ఆమోదం లభించిన తర్వాతే ఎమోజీలను విడుదల చేస్తారు. ఎమోజీలను మొదటగా జపాన్‌కు చెందిన ఇంటర్ఫేస్ డిజైనర్ షిగేటకా కురిటా 1999లో అభివృద్ధి చేశారు. 176 చిహ్నాలతో ప్రారంభమైన ఈ భాష..నేడు 3,663 ఎమోజీలకు చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో 44 కోట్ల మందికిపైగా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ఏపీ జనాభాలో 31% మందికి పైగా ఆన్లైన్ యూజర్లు ఉన్నారు. -
40 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ ఇవ్వొచ్చు!
న్యూఢిల్లీ: దేశంలో 40 ఏళ్లు నిండిన వారికి బూస్టర్ డోసు ఇవ్వొచ్చా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సార్స్–కోవ్–2 జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్ (ఇన్సాకాగ్) చెందిన శాస్త్రవేత్తల బృందం సిఫారసు చేసింది. కరోనా ముప్పు అధికంగా ఉండే ఆరోగ్య, పారిశుద్ధ్య, పోలీసు రంగాల్లో వ్యక్తులకు తొలుత బూస్టర్ డోసు ఇచ్చే అంశంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఇన్సాకాగ్ తన వారాంతపు నివేదికలో చెప్పింది. లోక్‌సభ ఎంపీలు బూస్టర్ డోసు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇన్సాకాగ్ ఈ సిఫారసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా వైరస్‌లోని జన్యుక్రమాలను పరీక్షించడానికి ఇన్సాకాగ్‌ను ఏర్పాటు చేశారు. కరోనా వేరియెంట్ కేసులు దేశంలోకి ప్రవేశించాయన్న విషయాన్ని త్వరితగతిన తెలుసుకోవడం కష్టసాధ్యమని, అందుకే కరోనా నిబంధనలన్నీ కచ్చితంగా పాటించాలని చెప్పింది. -
సికింద్రాబాద్, నాంపల్లి: మాకొద్దీ స్టేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి అంశం మరోసారి వెనక్కి వెళ్లింది. రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు సరికదా కనీసం ఆసక్తి కూడా చూపకపోవడం గమనార్హం. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను విమానాశ్రయం తరహాలో పునరభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు గత నాలుగేళ్లుగా నానుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్ఎస్డీసీ) రెండుసార్లు, గతంలో దక్షిణమధ్య రైల్వే రెండుసార్లు ఇన్వెస్టర్లను ఆహ్వానించాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. మొదట్లో కొన్ని కన్సార్టియంలు ఆసక్తిని ప్రదర్శించినప్పటికీ బిడ్డింగ్ దశలో వెనుకంజ వేశాయి. ఇటీవల ఐఆర్ఎస్డీసీ మరోసారి బిడ్డింగ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ కోవిడ్ దృష్ట్యా ఇన్వెస్టర్లు, కన్సార్టీయంల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. మరోవైపు కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని పలు రైల్వేస్టేషన్ల పునరభివృద్ధిలో కూడా ఇలాంటి అనాసక్తి వ్యక్తం కావడంతో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను పెండింగ్ జాబితాలో పెట్టినట్లు పేర్కొన్నారు. ఎందుకీ అనాసక్తి. ►రైల్వేల ప్రైవేటీకరణలో భాగంగానే స్టేషన్ల రీడెవలప్మెంట్ ముందుకు వచి్చంది. ఐఆర్ఎస్డీసీ సైతం అదే లక్ష్యంతో ఏర్పడింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లను ‘డిజైనింగ్, బిల్డింగ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్’ అనే పద్ధతిలో ప్రైవేట్‌సంస్థలకు అప్పగించేందుకు కార్యాచరణ చేపట్టారు. ►దక్షిణమధ్య రైల్వేలో మొదటి దశలో సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను ఎంపిక చేశారు. ఈ స్టేషన్ల రీ డెవలప్మెంట్ ద్వారా పెట్టుబడి సంస్థలు వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలతో ఆదాయాన్ని ఆర్జించవచ్చు. స్టేషన్లలో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు రైల్వేకు కూడా ఆదాయం లభిస్తుంది. పైగా రైల్వే సొంతంగా పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉండదు. ►కింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లను 45 సంవత్సరాలకు లీజుకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ తరువాత నిర్మాణాలతో సహా స్టేషన్లను రైల్వేకు అప్పగించవలసి ఉంటుంది. కానీ ఈ లీజు కాలపరిమితికి బడా కన్సార్టియంలు విముఖతను వ్యక్తం చేశాయి. లీజు గడువును పెంచాలని కోరాయి. కానీ రైల్వేశాఖ అంగీకరించకపోవడంతో రీ డెవలప్మెంట్ వాయిదా పడింది. ఇప్పుడు కోవిడ్... ►మొదట్లో లీజు గడువు తక్కువగా ఉందనే కారణంతో ఇన్వెస్టర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాగా ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇంచుమించు గత రెండేళ్లుగా ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదు. ►ఒక్క ఢిల్లీ రైల్వేస్టేషన్ల రీడెవలప్మెంట్ మాత్ర మే పట్టాలెక్కింది. మిగతా చోట్ల అటకెక్కింది. ►సాధారణంగా 7 నుంచి 12 మంది ఇన్వెస్టర్లు లేదా నిర్మాణ సంస్థలు ముందుకు వస్తే అనూహ్యమైన స్పందన ఉన్నట్లుగా భావిస్తారు. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లకు 2 నుంచి 3 సంస్థల కంటే ఎక్కువగా ముందుకు రాకపోవడం గమనార్హం. మూడంచెల్లో నిర్మాణం... ఐఆర్ఎస్డీసీ ప్రతిపాదించినట్లుగా స్టేషన్లను పునరభివృద్ధి చేస్తే ఇప్పుడు ఉన్న స్టేషన్‌కు ఏ మాత్రం విఘాతం కలగకుండా కింద మూడు వరుసల్లో పార్కింగ్, పైన మూడు వరుసల్లో వాణిజ్య స్థలాలను ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫామ్‌లపైన డోమ్ ఆకారంలో పై కప్పు ఏర్పాటు చేస్తారు. దీంతో ఇది పూర్తిగా ఎయిర్‌పోర్టు తరహాలో కనిపిస్తుంది. -
జెట్ ఎయిర్వేస్ : ఉద్యోగుల చొరవ
సాక్షి, న్యూఢిల్లీ : రుణభారంతో కుదేలైన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై దివాలా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులు తమ సంస్థను గట్టెక్కించేందుకు , తద్వారా తమ భవిష్యత్తు భరోసాకు నడుం బిగించారు. ఆది గ్రూపు భాగస్వామ్యంతో ఉద్యోగుల కన్సార్షియం బిడ్ దాఖలు చేసేందుకు ముందుకు వచ్చింది. ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్) ద్వారా 75 శాతానికి బిడ్ దాఖలు చేస్తామని శుక్రవారం ప్రకటించింది. సంస్థ ఉద్యోగులు ఇలాంటి చొరవ తీసుకోవడం ఇదే తొలిసారని బిజినెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. భారత విమానయాన చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని అంటున్నారు. "ఇది నిజంగా ప్రధానమంత్రి కల 'సబ్కా సాథ్, సబ్ కా వికాస్ సబ్ కా విశ్వస్' ను సూచిస్తుందంటూ , ఉద్యోగుల కన్సార్షియం ఆదిగ్రూప్ జారీ చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు విలేకరుల సమావేశంలో సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్, జనరల్ సెక్రటరీ, జెట్ సీనియర్-మోస్ట్ పైలట్లలో ఒకరైన కెప్టెన్ అశ్వని త్యాగి, ఆది గ్రూపు ప్రతినిధులు పాల్గొన్నారు. కంపెనీకి రుణాలిచ్చిన 26 సంస్థల తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెట్ ఎయిర్వేస్పై 2016 నాటి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) దివాలా ప్రక్రియ పిటీషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఈ పిటీషన్‌ను ఈ నెల 20న స్వీకరించగా తదుపరి విచారణ జూలై 5న జరగనుంది. భారత్‌లో దివాలా ప్రక్రియకు చేరిన తొలి విమానయాన సంస్థగా జెట్ ఎయిర్వేస్ నిలిచింది. ఐఆర్‌పీగా నియమితులైన ఆశీష్ చౌచారియా 90 రోజుల్లో రిజల్యూషన్ ప్రణాళికను అందజేయాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనం ఆదేశించింది. కాగా బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థలకు జెట్ ఎయిర్వేస్ కంపెనీ రూ.8 500 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు, వెండార్లకు కలిపి మొత్తం 25వేల కోట్ల లోనే బకాయిలున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి ఈ కంపెనీ కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. -
జేపీ అసోసియేట్స్‌కు బ్యాంకుల ఊరట
♦ రుణ పునరుద్ధరణకు ఓకే! ♦ 30 వేలకోట్ల రుణం 3 భాగాలు ♦ వ్యాపారాల విక్రయంతో చెల్లింపులు న్యూఢిల్లీ: జై ప్రకాష్ అసోసియేట్స్‌కు భారీ ఊరట లభించింది. కంపెనీ రుణాలను పునరుద్ధరించేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం అంగీకరించింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు విషయాన్ని వెల్లడించాయి. రూ.30,000 కోట్ల రుణాన్ని 3 భాగాలుగా వర్గీకరించడం ఈ పునరుద్ధరణ ప్రణాళికలో భాగం. తన సిమెంట్ వ్యాపారంలో ముఖ్యమైన భాగాన్ని అల్ట్రాటెక్ సిమెంట్‌కు విక్రయించడం ద్వారా జేపీ అసోసియేట్స్ బ్యాలెన్స్ షీట్ నుంచి రూ.10,000 కోట్ల మేర రుణ భాగం మొదట తొలగిపోనుంది. ఇక కంపెనీ ఆధ్వర్యంలోని రూ.13,000 కోట్ల విలువైన భూములను స్పెషల్ పర్పస్ వెహికల్ కింద రుణదాతలు తమ నియంత్రణలోకి తీసుకుంటారు. ఈ భూములను విక్రయించడం ద్వారా దీర్ఘకాలంలో రెండో రుణ భాగాన్ని తీర్చాల్సి ఉంటుంది. మిగిలిన మరో రుణ భాగం కంపెనీ బ్యాలన్స్ షీట్లలోనే ఉంటుంది. కంపెనీ నిర్వహణలో ఇంకా కొంత మేర సిమెంట్ వ్యాపారం, ఈపీసీ విభాగం, 5 లగ్జరీ హోటళ్లు, విద్యుత్ ప్లాంట్లు, ఒక హాస్పిటల్, స్పోర్ట్స్ వ్యాపారం ఉంటాయి. వీటిపై ఆధారపడి కంపెనీ మూడో రుణ భాగాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రణాళికపై జేపీ అసోసియేట్స్, ఐసీఐసీఐ బ్యాంకు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. -
సింగపూర్ కన్సార్టియంపై ముందే నిర్ణయం
హైకోర్టుకు నివేదించిన ఆదిత్య, ఎన్వీయన్ కంపెనీలు సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులను సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకుందని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ హైకోర్టుకు నివేదించారు. సింగపూర్ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపిన తరువాతే పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. స్విస్ చాలెంజ్ కింద సింగపూర్ కంపెనీల కన్సార్టియం సుమోటో (తనంతట తాను)గా స్పందించి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సమర్పించిందంటూ ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘భారతదేశం వెలుపల’ అన్న షరతు విధించి, దేశీయ కంపెనీలేవీ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేస్తోందని వివరించారు. తద్వారా ముందస్తుగా అనుకున్న సింగపూర్ కంపెనీల కన్సార్టియంకే పనులు అప్పగించేందుకు మార్గం సుగమం చేసుకుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ప్రతి దశలోనూ నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. కన్సార్టియం ప్రతిపాదనలకు పోటీగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరుతూ సీఆర్డీఏ కమిషనర్ ఇటీవల జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ లిమిటెడ్ కూడా టెండర్ నోటిఫికేషన్‌ను, ఆ తరువాత జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం విచారణ జరిపారు. ఆదిత్య హౌసింగ్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, ఎన్వీయన్ ఇంజనీర్స్ తరఫున వేదుల వెంకటరమణ తమ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆనందం పరవళ్లు..