నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: పోక్సో కేసులో జీవిత ఖైదు పడిన ఓ వ్యక్తిని ఢిల్లీ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బాధితురాలు ‘శారీరక సంబంధం’అని చెప్పినంతమాత్రాన లైంగిక దాడి చేసినట్లు కాదని పేర్కొంది. 2017లో ఓ మహిళ... తన 14 ఏళ్ల కుమార్తెను కిడ్నాప్ చేశారని ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. నిందితుడితో పాటు బాలిక ఫరీదాబాద్‌లో దొరికారు.
తామిద్దరికీ శారీరక సంబంధం ఏర్పడిందని బాధితురాలు వెల్లడించింది. అయితే మైనర్ కావడంతో ఆ వ్యక్తిమీద పోక్సో చట్టం కింద జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై నిందితుడు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ అమిత్ శర్మలతో కూడిన ధర్మాసనం విచారణకు అనుమతించింది. విచారించిన ధర్మాసనం బాధితురాలు స్వచ్ఛందంగా నిందితుడితో వెళ్లినప్పుడు లైంగిక దాడి జరిగిందని ట్రయల్ కోర్టు ఎలా నిర్ధారించిందో స్పష్టంగా తెలియదని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment